మెగా స్టార్ చిరంజీవి కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా విజేతకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన తరువాత ఆమూవీ టైటిల్ పై అనేక కామెంట్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈఫస్ట్ లుక్ పోస్టర్ ను నిశితంగా పరిశీలించిన కొంతమంది మాత్రం చిరంజీవి తన చిన్నల్లుడి  సక్సస్ ఫుల్ కెరీర్ కోసం మెగా స్టార్ న్యూమరాలజీని ఫాలో అయినట్టుగా కనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
KALYAN DEV LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
చిరంజీవి చిన్నల్లుడు పూర్తి పేరు కల్యాణ్ దేవ్. ఇంగ్లీష్ లో ‘kalyan dev’ అని రాయాలి అంటే ఈ పేరులో 9 అక్షరాలుంటాయి. న్యూమరాలజీ ప్రకారం 9 అక్షరాల పేరు కూడా చాలామందికి కలిసొస్తుంది. అయితే చిరంజీవి చిన్నఅల్లుడి జాతకం ప్రకారం అతడికి 11అక్షరాల పేరయితే బాగా కలిసొస్తుందని చిరంజీవికి ఒక ప్రముఖ జ్యోతిష్కుడు సూచించాడట. 
KALYAN DEV LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనితో చిరంజీవి అల్లుడి పేరుని 11అక్షరాల ‘kalyaan dhev’ గా మార్చాడు చిరంజీవి. ఈ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ చిరంజీవి చిన్నల్లుడి మూవీ ‘విజేత’ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఈ 11అక్షరాల పేరుతో ప్రజెంట్ చేశారు. చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ విషయంలో కూడ ఇలాంటి సెంటిమెంట్ ను ఫాలో అయిన సందర్భాలు ఉన్నాయి.
KALYAN DEV LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
వాస్తవానికి చరణ్ పూర్తిపేరు రామ్ చరణ్ తేజ్ అయితే అతడి జాతకానికి తేజ్ అన్న అక్షరాలు కలిసిరావు కాబట్టి అతడి పేరును రామ్ చరణ్ గా మాత్రమే వాడుకలోకి తీసుకు వచ్చాడు. చరణ్ సినిమా ఫీల్డ్ లోకి వచ్చిన కొత్తలో చరణ్ పేరును రామ్ చరణ్ తేజ్ అని వ్రాయకుండా రామ్ చరణ్ అని వ్రాయమని 9 సంఖ్య న్యూమరాలజీ నమ్మకంతో అప్పుడు చరణ్ తరఫున మీడియాకు విజ్ఞప్తులు వచ్చాయి అన్న వార్తలు కూడ గతంలో వచ్చాయి. ఏది ఎలా చూసుకున్నా చిరంజీవి తన చిన్న అల్లుడి జాతకం పై పెట్టుకున్న నమ్మకాన్ని ‘విజేత’ మూవీ రిజల్ట్ ద్వారా తెలుగు ప్రేక్షకులు త్వరలో తమ నిర్ణయాన్ని తెలియచేయబోతున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: