‘మహానటి’ మూవీ సూపర్ హిట్ కావడంతో ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో బయోపిక్ ల సీజన్ మొదలైంది. రాబోయే సంక్రాంతికి ఎన్టీఆర్ బయోపిక్ అదేవిధంగా వైఎస్ఆర్ బయోపిక్ లు ఒకదాని పై ఒకటి పోటీగా విడుదల కాబోతున్నాయి అంటే బయోపిక్ ల మ్యానియా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏవిధంగా షేక్ చేస్తోందో అర్ధం అవుతుంది. 
NAGARJUNA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇలాంటి పరిస్థుతులలో అక్కినేని నాగేశ్వరరావు జీవితం పై కూడ అన్నపూర్ణ ఫిలిం ఇన్స్టిట్యూట్ విధ్యార్ధులు నాగార్జున సహకారంతో అక్కినేని బయోపిక్ ను తీసే ఉద్దేశ్యంలో పరిశోధనలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈవార్తల పై నాగార్జున స్పందించినట్లు తెలుస్తోంది. తనను అక్కినేని బయోపిక్ విషయంలో ఇప్పటి వరకు ఎవరు తనను కలవలేదని క్లారిటీ ఇచ్చినట్లు టాక్. 
NAGARJUNA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అంతేకాదు అక్కినేని జీవితం బయోపిక్ సినిమా నిర్మాణానికి పనికిరాదని నాగార్జున అభిప్రాయం అని అంటున్నారు. దీనికి కారణం అక్కినేని జీవితంలో చెప్పుకోతగ్గ సంచలనాలు అదేవిధంగా చీకటి కోణాలు లేవని తెరిచి ఉన్న పుస్తకం లా అక్కినేని తన జీవితాంతం ఆనందంగా జీవించి మరింత గౌరవ ప్రదంగా మరణించడంతో అక్కినేని జీవితంలోని సంఘటనలు బయోపిక్ మూవీకి సరిపోయేలా ఉండవు అని నాగ్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. 
NAGARJUNA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అదేవిధంగా అక్కినేని జీవితానికి సంబంధించి ఏదైనా ఒక సీక్రెట్ ఉంది అంటే అది కేవలం మే 23వ తారీఖు మాత్రమే అంటూ మే 23న అక్కినేని తన సినిమాల అవకాశాల కోసం చెన్నై పట్టణం వెళితే అదే మే 23న అక్కినేని ఆఖరి చిత్రం ‘మనం’ విడుదలైన సందర్భాన్ని నాగార్జున గుర్తుకు చేసుకున్నాడు. అంతేకాదు నాగార్జున నటించిన తొలి సినిమా ‘విక్రమ్’ కూడ అదే మే 23న విడుదల కావడం యాదృశ్చికం అని అంటున్నాడు నాగ్. అక్కినేని బయోపిక్ పై నాగార్జున ఈ క్లారిటీ ఇవ్వడంతో ఇక తెలుగు ప్రేక్షకులకు భవిష్యత్ లో అక్కినేని బయోపిక్ కలలు నెరవేరనట్లే అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: