గ్లామర్ ప్రపంచం సినిమా రంగం. ఏ విషయాన్ని అయినా అందంగా చూపెడితేనే ప్రేక్షకులు చూస్తారు. వేసుకునే దుస్తులు దగ్గర నుంచి హీరోయిన్ అందాల వరకూ అంతా గ్లామర్ మయంగా ఉండాలి. గ్లామర్  కోసం నిర్మాత ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెట్టడానికి నిర్మాత వెనకాడడు. ప్రస్తుతం తీస్తున్న సినిమాలన్నీ కధ కంటే గ్లామర్ కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉండటంతో హీరోయిన్ల అందాలతో పాటు ఆ అందాన్ని చక్కగా ఎక్స్ పోజ్ చేయగల కధానాయికలకు ఎన్ని కోట్లు అయినా నిర్మాత ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు.

ఆ స్కిన్ షో చూపెట్టి కాసులు దండుకోవాలని నిర్మాతల ఆలోచన. ఇలాంటి హాట్ సన్నివేశాలు చేయడంలో బాలీవుడ్ లో కత్రినా, బిపాసాబసు లు ముందు ఉంటే మన టాలీవుడ్ లో తమన్నా, కాజల్ లు ముందు వరుసలో ఉంటారు. అయితే అదృష్టం కలిసి రావడంతో శ్రుతిహాసన్ ఈ స్కిన్ షో విషయంలో ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ గా ఉంది. బాలీవుడ్ లో శ్రుతిహాసన్ హీరో అర్జున్ రామ్ పాల్ తో కొన్ని హాట్ సన్నివేశాలు లిప్ లాకింగ్ సీన్స్ ‘డిడే’ సినిమాలో నటించింది అన్న విషయం తెలిసిందే. ఆ సన్నివేశాలను చూసిన ఒక తెలుగు నిర్మాత ప్రస్తుతం తాను శ్రుతితో నిర్మిస్తున్న సినిమాలో ఆ సినిమా హీరోతో హాట్ గా ఉండే లిప్ లాకింగ్ సీన్ నటించమని కోరాడట.

దానికి ఒక్క క్షణం కూడా ఆలోచించ కుండా తనకు ఇస్తున్న పారితోషికానికి అదనంగా నరో 25 లక్షలు ఇస్తే ఆ సన్నివేశంలో నటించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని మన తేనె కళ్ళ సుందరి చెప్పిందట దీనితో మైండ్ బ్లాంక్ అయిన సదరు నిర్మాత ఒక్క నిముషం ముద్దుకు 25 లక్షలు ఖర్చు చేయడమా అని ఆలోచిస్తున్నాడట.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: