తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీడేస్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా హిట్ కాలేదు.  స్వామిరారా చిత్రం తర్వాత మనోడికి గోల్డెన్ టైమ్ మొదలైందనే చెప్పాలి.  కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడ, కేశవ లాంటి డిఫరెంట్ కథనాలు ఉన్నచిత్రాలతో ప్రేక్షకుల మనసు దోచాడు నిఖిల్.   ప్రస్తుతం ఇండస్ట్రీలో నిఖిల్ చిన్న నిర్మాతల పాలిట వరంగా మారారు. 

Image result for nikhil


హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్న యంగ్ హీరో నిఖిల్. ఈ ఏడాది ‘కిరాక్‌ పార్టీ’ అంటూ యంగ్‌ హీరో నిఖిల్‌ ప్రేక్షకులను పలకరించాడు. అది ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయే సరికి తన తదుపరి సినిమాపై దృష్టి సారించాడు ఈ కుర్రహీరో. నిఖిల్‌ ప్రస్తుతం.. తమిళ్‌లో విజయం సాధించిన కనితన్‌ మూవీని తెలుగులో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. 
Image result for nikhil
నిఖిల్ పుట్టిన రోజు సందర్బంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను అభిమానులకు షేర్ చేసాడు.నిఖిల్‌ నటిస్తోన్న 16వ చిత్రం ‘ముద్ర’ సినిమాలో హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. టీ.యన్‌. సంతోష్‌ దర్శకత్వంలో ఆరా సినిమాస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, మూవీ డైనమిక్స్‌ ఎల్‌.ఎల్‌.పి పతాకాలపై కావ్య వేణుగోపాల్, రాజ్‌కుమార్‌లు ఈ మూవీని నిర్మిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: