హాలీవుడ్ నుంచి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఫోర్న్ బ్యూటీ సన్నీలియోన్ జిస్మ్ 2 చిత్రంతో హీరోయిన్ గా మారింది.   తర్వాత సన్నిలియోన్ నటించిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేదు. దాంతో ఈ అమ్మడు ఐటమ్స్ సాంగ్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టింది. తెలుగు, తమిళంలో కూడా సన్నీలియోన్ తన సత్తాచాటుతుంది.  ఆ మద్య రాజశేఖర్ నటించిన గరుడ చిత్రంలో డియ్యో డియ్యో సాంగ్ లో దుమ్ముదులిపింది. ఇక బాలీవుడ్ లో హాట్ సెక్సీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.. రాఖీసావంత్. 
Image result for sunny leone rakhi sawant
ఈ అమ్మడు నటించిన చిత్రాలు తక్కువే అయినా పాపులారిటీ మాత్రం చాలా వచ్చింది. ఎప్పుడూ ఎదో ఒక కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రాఖీసావంత్ తాజాగా రాజీవ్ ఖండేల్ వాలా చాట్ షో 'జజ్ బాత్... సంగీన్ సే నమ్కీన్ తక్'లో పాల్గొన్న సందర్భంగా, హాట్ బ్యూటీ సన్నీలియాన్ కు క్షమాపణలు చెప్పింది.
Rakhi Sawant says 'sorry' to Sunny Leone on Rajeev Khandelwal's 'Juzz Baatt'
బిగ్ బాస్ సీజన్ 11 పోటీదారు అర్షిఖాన్ తో కలసి ఈ షోలో పాల్గొన్న రాఖీ తాను గతంలో సన్నిలీయోన్ పై ఎన్నో విమర్శలు చేశానని అందుకు తాను క్షమించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.
Image result for sunny leone rakhi sawant
అంతే కాదు  సన్నీ గురించి, ఆమె జీవితంలో పడిన కష్టాలను గురించి తనకా సమయంలో ఏ మాత్రం తెలియదని, ఏమీ తెలుసుకోకుండానే ఆమె సాగించిన ప్రయాణం గురించి వ్యాఖ్యానించడం తప్పేనని చెప్పింది. అప్పట్లో అలా అనుండాల్సింది కాదని అభిప్రాయపడింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: