మెగాహీరో అల్లుఅర్జున్ అప్‌క‌మింగ్ మూవీ రేసుగుర్రంకి సంబంధించిన షూటింగ్‌ యాక్షన్ స‌న్నివేశాలలోకి వెళ్ళింది. రేసుగుర్రం డైరెక్టర్ సురేందర్‌రెడ్డికి క‌థ ఎంత ముఖ్యమో అంత‌కంటే యాక్షన్ స‌న్నివేశాల‌ను స‌రికొత్తగా చిత్రించాల‌నే తాప‌త్రయం కూడ కొద్దిగా ఎక్కువే. అందుకే ఫారిన్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకొని వ‌చ్చి, ఇక్కడ అన్నపూర్ణ సెవెన్ ఎక‌రాస్ మ‌రో సాంగ్‌ను పూర్తిచేసుకున్న రేసుగుర్రం మూవీ, ఇప్పుడు యాక్షన్ స‌న్నివేశాల‌ను ప్రారంభించింది. రామ్ – లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేస్తున్న ఫైట్స్‌కి అల్లుఅర్జున్ స్టంట్స్ చేస్తున్నాడు.

అల్లుఅర్జున్ త‌న‌ ప్రీవియ‌స్ మూవీల కంటే రేసుగుర్రంలో భారీగా యాక్షన్ స్టంట్స్‌ను చేయ‌నున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ స‌న్నివేశాల‌ని ఎదో ఒక యాక్షన్ ఫైట్‌లో ముగించే సురేంద‌ర్ రెడ్డి, ఈ రేసుగుర్రాన్ని కూడ అదే త‌ర‌హాగా ఇట‌ర్వెల్ బ్యాంగ్ అండ్ క్లైమాక్స్ సీన్స్‌ని యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఫినిష్ చేయాల‌ని ప్రిపేర్ అయ్యాడ‌ట‌. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సలోని కనిపిస్తుంది. స‌లోని కూడ అల్లుఅర్జున్ స‌ర‌స‌న అందాల‌ను ఆరబోటానికి రెడీగా ఉంది. స్టైలిష్‌స్టార్ ఫైటింగ్ ఓవ‌రాయాక్షన్ గా ముదిరితే రేసుగుర్రం చ‌తిక‌ల‌ప‌డ‌టం ఖాయం అని సురేంద‌ర్‌రెడ్డి గురించి టాలీవుడ్‌లో వినిపిస్తున్న టాక్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: