తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో వరుణ్ తేజ్.  మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ‘ముకుంద’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  మొదటి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసిన వరుణ్ ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘కంచె’ చిత్రంతో మరో అద్భుతమైన విజయం సాధించాడు.  ఆ తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా పేరు తెచ్చుకోక పోయినా..శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’మరో అద్భుతమైన విజయం సాధించింది. 
Image result for varun tej vomagami
ఆ తర్వాత తొలిప్రేమతో మరో హిట్ సాధించాడు..ఇలా వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న వరుణ్ తేజ్ ‘ఘాజీ’ చిత్ర దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నాడు. ఘాజీ' సినిమాతో సంకల్ప్ రెడ్డి మంచి సత్తా వున్న దర్శకుడు అనిపించుకున్నాడు. తక్కువ బడ్జెట్ లోనే భారీ మూవీ చేశాడు అనే ప్రశంసలు కొట్టేశాడు. 

ప్రస్తుతం వరుణ్ తేజ్ తో తీసే చిత్రం అంతరిక్షం నేపథ్యంలో రూపొందుతోన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో  వరుణ్ తేజ్ 'వ్యోమగామి'గా కనిపించనున్నాడు. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ ప్రత్యేక శిక్షణ తీసుకుని మరీ నటిస్తున్నారు.   
Image result for varun tej antariksham
ఈ సినిమా కోసం కొన్ని టైటిల్స్ ను పరిశీలించిన టీమ్ .. 'అంతరిక్షం' అనే టైటిల్ వైపు మొగ్గుచూపిందట. దాంతో నిర్మాతలు 'అంతరిక్షం' అనే టైటిల్ ను ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి .. అదితీరావు నటిస్తున్నారు. ఇప్పటికే 'ఫిదా' .. 'తొలిప్రేమ' సినిమాలతో సక్సెస్ ను అందుకున్న వరుణ్ తేజ్, ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.       



మరింత సమాచారం తెలుసుకోండి: