మరికొన్ని రోజులలో ప్రారంభం కాబోతున్న ‘బిగ్ బాస్ 2’ ను నేచురల్ స్టార్ నాని ఎలా నిర్వహిస్తాడు అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగిపోతోంది. దీనికితోడు ఈమధ్య ఈషోకు సంబంధించి జరిగిన మీడియా మీట్ లో నాని తాను జూనియర్ కన్నా ఈషో విషయంలో ఏమి తక్కువ కాదు అంటూ వ్యూహాత్మకంగా చేసిన కామెంట్స్ నాని ఆత్మ స్థైర్యాన్ని సూచిస్తున్నాయి.
Jr. Ntr,actor Jr. Ntr,Jr. Ntr Latest Pics,Jr. Ntr Latest photos,Jr. Ntr Latest stills,Jr. Ntr Latest pictures,Jr. Ntr Latest images,actor Jr. Ntr Latest Pics,telugu actor Jr. Ntr Latest Pics
ఈకామెంట్స్ ను వేరే కోణంలో తీసుకున్న కొందరు జూనియర్ వీరాభిమానులు ఈషో నిర్వహణలో నాని స్థాయిని జూనియర్ స్థాయితో పోలుస్తూ కొన్ని విచిత్రమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ అందరి దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి.  గత ఏడాది ‘బిగ్ బాస్ షో’ చేసినందుకుగాను జూనియర్ కు ఎపిసోడ్ కు 50 లక్షలు పారితోషికం ఇస్తే నానీకి మాత్రం కేవలం ఈషోకు ఒక్కో ఎపిసోడ్ కు 10 లక్షలు మాత్రమే ఇస్తున్నారు అంటూ కొందరు నానీ పై సెటైర్లు వేస్తున్నారు. 
nani replaced with jr ntr
ఇప్పుడు జూనియర్ నానీలను పోలుస్తూ ఈ షో పై కొందరు చేస్తున్న కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏమిటి అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. నానీ జూనియర్ ల పారితోషిక స్థాయి గురించి చర్చలు జరపకుండా వారు ఆ షోను ఎలా రన్ చేస్తున్నారు సిట్యుయేషన్స్ ఎలా డీల్ చేయగలిగారు అన్న పోలికలు పోలిస్తే బాగుంటుంది కానీ నానీకన్నా క్రేజ్ లో ఎంతో ముందు ఉన్న జూనియర్ ను నానీతో పోల్చడం ఏమిటి అంటూ మరికొందరు నానీకి సపోర్ట్ ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 
nani to host second session of bigg boss telugu
ఇది ఇలా ఉండగా ఇలాంటి అనవసరపు పోలికలు నాని జూనియర్ ల మధ్య ఏర్పడతాయి అన్న ఉద్దేశ్యంతో స్టార్ మా టివి యాజమాన్యం ఈ షో విషయంలో అనేక మార్పులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈషోలో అడల్ట్ కంటెంట్ తో ఉండే జోక్స్ ఎక్కువగా ఉంటాయి అన్న సంకేతాలు ఇప్పటికే ఉన్నాయి. దీనితో ఈ షో పై విమర్శలు వస్తాయా లేదంటే బూతు కంటెంట్ డైలాగులను బుల్లితెర ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ చూస్తారా అన్న విషయం మరికొద్ది రోజులలో తేలిపోతుంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: