సూపర్ స్టార్ రజినికాంత్ నటించిన కాలా సినిమా ఈరోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఫారిన్ కంట్రీస్ లో ఓ రోజు ముందే ప్రీమియర్స్ పడతాయని తెలిసిందే. కబాలి తర్వాత రజిని చేసిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు ఎదురుదెబ్బలు అదే విధంగా ఉన్నాయి.


కర్ణాటకలో సినిమాకు అడ్డు పడుతుండగా సుప్రీం రజిని సినిమా రిలీజ్ కు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పింది. ఇక సినిమా ప్రీమియర్స్ తో మంచి టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఓ అభిమాని సింగపూర్ లో సినిమా చూస్తూ దాన్ని ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ కాలా టీం అతని మీద యాక్షన్ కు దిగింది. 


ప్రవీణ్ తేవార్ అనే వ్యక్తి కాలా సినిమాను సింగపూర్ ది కాథే సినిప్లెక్స్ లో చూస్తున్నాడు. తాను చూసే సినిమా అందరికి చూపించదలచి ఫేస్ బుక్ లో లైవ్ పెట్టేశాడు. కోలీవుడ్ ఇండస్ట్రీ అంతా దీనికి షాక్ అయ్యింది. పైరసీ మీద ఫైట్ చేస్తున్న విశాల్ అక్కడ అఫిషియల్స్ ను సంప్రదించి అతన్ని అరెస్ట్ చేయాల్సిందిగా కోరారు. 


మొత్తానికి కాలాకి ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ తో పెద్ద షాక్ ఇచ్చాడు ఆ వ్యక్తి. అది పక్కన పెడితే కాలా మాత్రం ప్రీమియర్స్ ద్వారా మంచి టాక్ తెచ్చుకుంది. సినిమా ఈసారి రజినికి సత్తా చాటేలా హిట్ కొడుతుందని అంటున్నారు. పాజిటివ్ టాక్ వస్తే రజిని సినిమా రికార్డ్ కలక్షన్స్ సాధించినట్టే.


మరింత సమాచారం తెలుసుకోండి: