తెలుగు ఇండస్ట్రీలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది.  ఒక లేడీ ఓరియెంటెండ్ చిత్రం అయినా..స్టార్ హీరోల చిత్రాల్లా అద్భుతమైన కలెక్షన్లు రాబట్టిందంటే..అది కేవలం మహానటి సావిత్రిపై ఉన్న అభిమానమే అంటున్నారు ఇంటస్ట్రీ వర్గం.  ఇక సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు.  గతంలో సావిత్రిపై ఎన్నో కథనాలు వచ్చినా..వాటన్నింటికి సమాధానంగా ‘మహానటి’చిత్రంలో దాదాపు అన్ని వాస్తవిక దృశ్యాలు ఆవిష్కరించారు. 

ఇక మహానటి చిత్రం రిలీజ్ అయిన తర్వాత సావిత్రితో ఉన్న సన్నిహితులు..ఆమెతో పరిచయం ఉన్నవారు ఒక్కొక్కరూ సోషల్ మీడియాలో రక రకాల కథనాలు వెల్లుబుచ్చుతున్నారు.   సావిత్రి .. జెమినీ గణేశన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికే జెమినీ గణేశన్ కి రెండు పెళ్లిళ్లు అయ్యాయి .. పిల్లలు వున్నారు. అయినా ఆయన పట్ల గల ప్రేమతోనే పెళ్లి చేసుకున్నారు.
Image result for savitri gemini ganesan
ఇద్దరూ కొంతకాలం పాటు చాలా అన్యోన్యంగానే వున్నారు. అయితే సావిత్రి, జెమినీ గణేశన్ ను ఏమని పిలిచేవారనే సందేహం అభిమానుల్లో తలెత్తుతూ ఉంటుంది. ఏదైనా ఇంటర్వ్యూల్లో జెమినీ గణేషన్ గురించి మాట్లాడి వస్తే..‘అయ్యార్’ అని సంబోదించేవారంట. ఇంట్లో మాత్రం ఆయనను ఎన్నాంగో అని పిలిచేవారట..ఎన్నాంగో అంటే ‘ఏవండీ’ అని అర్ధం.  


మరింత సమాచారం తెలుసుకోండి: