నందమూరి కుటుంబ వారసుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్నో సినిమాలు నిర్మించి ఆ సినిమాలు పరాజయం చెందడంతో కోట్లల్లో డబ్బును పోగొట్టుకున్నాడు అన్న ప్రచారం ఉంది. ఈవారం విడుదల కాబోతున్న తన లేటెస్ట్ మూవీ ‘నా నువ్వే’ సినిమాను ప్రమోట్ చేస్తూ కళ్యాణ్ రామ్ తాను తీసిన సినిమాల వల్ల వచ్చిన నష్టాల పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 

సినిమాలు తీయడం అందులో విజయం సాధించడం అన్నది ఎవరికీ అంతుపట్టని సీక్రెట్ అని అంటూ ఏసినిమా హిట్ అవుతుందో మరే సినిమా ఫ్లాప్ అవుతుందో ఎవరికీ తెలియని విషయం అని అంటూ కేవలం అదృష్టం వలన మాత్రమే సినిమాలలో విజయాలు ఉంటాయి అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. తాను సినిమాలు తీసి కోట్లు పోగొట్టుకున్నా తాను ఎప్పుడూ బాథపడలేదనీ దానికి కారణం తాను జూదం ఆడి డబ్బు పోగొట్టుకోలేదు అని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

ఇదే సందర్భంలో తన మనస్తత్వం గురించి మాట్లాడుతూ తాను ఎదుట వారి దగ్గర కఠినంగా ఉండలేను అన్న విషయాన్ని వివరిస్తూ ప్రస్తుత పరిస్థుతులలో కఠినంగా వ్యవహరించలేనివారు విజయాలను అందుకోలేరు అంటూ ప్రస్తుత ఫిలిం ఇండస్ట్రీ పరిస్థుతుల పై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అన్నీ కలిసి వస్తే ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ ‘చైతన్య రథం’ నడిపిన తన తండ్రి హరికృష్ణ పాత్రలో తాను నటించబోతున్న విషయాన్ని లీక్ చేసాడు కళ్యాణ్ రామ్. 
Kalyan Ram Interview Stills MLA Movie
ఇక ఈవారం విడుదల కాబోతున్న తన ‘నా నువ్వే’ సినిమా గురించి మాట్లాడుతూ తాను చాలకాలం తరువాత చేస్తున్న లవ్ స్టోరీ ఇది అని చెపుతూ తనకు రొమాన్స్ సీన్స్ పట్ల ఉన్న భయాన్ని వివరిస్తూ ఇలాంటి సీన్స్ లో జూనియర్ అంత బాగా ఎలా చేస్తాడా అని తనకు అనిపిస్తుంది అంటూ లిప్ లాక్ సీన్స్ అంటే బెదిరిపోయిన సందర్భాన్ని వివరించాడు కళ్యాణ్ రామ్. ఇక తన జీవితంలో ఎన్నో పరాజయాలు మరెన్నో ఆర్ధిక నష్టాలు ఎదుర్కున్నా వాటిని అన్నింటిని తట్టుకోవడంలో తన భార్య ఇచ్చిన సహకారాన్ని బయట పెడుతూ ‘మీతో కలిసి నాకు ముగ్గురు పిల్లలు’ అంటూ తనను ఒక పిల్లవాడిగా చూసుకునే తన భార్య లేకుంటే తాను లేను అని అంటున్నాడు కళ్యాణ్ రామ్..  



మరింత సమాచారం తెలుసుకోండి: