ఆగ‌ష్టు 8న రిలీజ్ అయిన షారుఖ్ చెన్నైఎక్స్‌ప్రెస్ మూవీ రికార్డుల మోత‌ను కొన‌సాగిస్తుంది. ఇప్పటికే 200 కోట్లను వ‌సూల్ చేసిన ఈ మూవీ, మ‌రో ప‌ది రోజుల్లో 300 కోట్ల రూపాయ‌ల‌ను అవ‌లీల‌గా దాటేస్తుంద‌ని బాక్సాపీస్ లెక్కలు చెబుతున్నాయి. బాలీవుడ్‌లో వంద కోట్ల రూపాయ‌ల క్లబ్ అనేది చాలా చిన్న మేట‌ర్ కావ‌చ్చు. కాని అతి త‌క్కువ స‌మ‌యంలోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిన సినిమా చెన్నైఎక్స్‌ప్రెస్ మూవీ. అంతే కాకుండా 200 కోట్ల క్లబ్‌లోనూ త్వర‌గా చేరిన మొద‌టి మూవీ కూడ చెన్నైఎక్స్‌ప్రెస్ మూవీనే. ఇన్ని రికార్డుల‌ను కొల్లగొట్టిన‌ చెన్నైఎక్స్‌ప్రెస్ మూవీ మొద‌టి రోజు నుండి 15 రోజుల వ‌ర‌కూ క‌లెక్షన్స్‌ను ఏ విధంగా ఉన్నాయో వివ‌రాలు ఇలా ఉన్నాయి.


1 రోజు: 6.75 కోట్లు
2 రోజు: 33.12 కోట్లు
3 రోజు: 28.05 కోట్లు
4 రోజు: 32.5 కోట్లు
5 రోజు: 12.62 కోట్లు
6 రోజు: 11.5 కోట్లు
7 రోజు: 12.56 కోట్లు
8 రోజు: 19.6 కోట్లు
9 రోజు: 6.5 కోట్లు
10 రోజు: 8.51 కోట్లు
11 రోజు: 10.22 కోట్లు
12 రోజు: 3.8 కోట్లు
13 రోజు: 7.06 కోట్లు
14 రోజు: 4.51 కోట్లు
15 రోజు: 3.25 కోట్లు
మొత్తం (ఇండియా మార్కెట్‌) : 200.55 కోట్ల రూపాయ‌లు

మరింత సమాచారం తెలుసుకోండి: