తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు నెంబర్ వన్ రేసులో ఉన్నారు.  ఈ మద్య రిలీజ్ అయిన ‘భరత్ అనే నేను’ రూ.200 కోట్ల క్లబ్ లో చేరడం ఇందుకు నిదర్శనం.  ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ అంటే ఓ ప్రత్యేకత ఉంటుంది.  ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకొని వెళ్లే సౌమ్యుడిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహష్ బాబు కూడా ఎలాంటి వివాదాల జోలికి వెళ్లరని పేరు ఉంది.
Image result for sammohanam movie
ఇక కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో సుదీర్ బాబు (కృష్ణ చిన్న కూతురు భర్త) హీరోగా ఎంట్రీ ఇచ్చారు.  కాకపోతే సుదీర్ బాబు కి ఇప్పటి వరకు ‘ప్రేమకథాచిత్రమ్’ మినహా పెద్దగా హిట్ అయిన చిత్రాలు ఏవీ లేవు.  తాజాగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుదీర్ బాబు, అదితిరావు హైద్రీ జంటగా ‘సమ్మోహనం’ చిత్రం ఈ రోజు రిలీజ్ అయ్యింది.  ఇప్పటికే నాని హీరోగా రూపొందిన ‘జెంటిల్‌మన్’, తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ‘అమీతుమీ’ సినిమాలతో ఇంద్రగంటి విజయాలు సొంతం చేసుకున్నాడు. 
Image result for sammohanam movie
ఈ నేపథ్యంలో ఈ దర్శకుడి తాజా చిత్రం ‘సమ్మోహనం’ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.  ఇక చిత్రం విషయానికి వస్తే..సినిమాలంటే అస్సలు ఇష్టం లేని, సినీ తారలపై సదాభిప్రాయం లేని ఓ కుర్రాడు.. ఒక హీరోయిన్‌ ప్రేమలో పడతాడు. ఆ హీరోయిన్ కూడా ఈ కుర్రాణ్ని ప్రేమిస్తుంది. ఒక స్టార్ హీరోయిన్, చిన్న పిల్లల బొమ్మలేసుకునే ఓ కుర్రాడి మధ్య నడిచే ప్రేమ కథే ఈ ‘సమ్మోహనం’. సింపుల్‌గా చెప్పాలంటే సినిమా పేరుకు తగ్గట్టే ‘సమ్మోహనం’గా ఉంది. ప్రేక్షకుడి మనసును హత్తుకునే సన్నివేశాలతో ఓ అందమైన ప్రేమకథను తెరపై ఆవిష్కరించారు దర్శకుడు.
Image result for sammohanam movie
సరదా సన్నివేశాలు, ఆకట్టుకునే కథనంతో ఫస్టాఫ్ కాస్త కనువిందు చేసింది. సుధీర్‌బాబు, అదితి మధ్య వచ్చే ప్రతి సన్నివేశం చాలా బాగుంది.కానీ సెంకడాఫ్‌లో కూడా సున్నితమైన భావోద్వేగాలు ప్రేక్షకుడి చేత కంటతడి పెట్టిస్తాయి. దర్శకుడు సెకండాఫ్ కాస్త సాగదీశారని అంటున్నారు ప్రేక్షకులు.  సుదీర్ బాబు, అదితి నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ఇక తనికెళ్ల భరణి, పవిత్ర లోకేష్, రాహుల్ రామకృష్ణ, హరితేజ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. వివేక్ సాగర్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం చాలా బాగున్నాయి. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్, ఇంద్రగంటి మోహనకృష్ణ డైలాగులు, సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ లిరిక్స్ ఇలా అన్నీ బాగున్నాయి.   కొన్ని చోట్లు బోర్ కొట్టించే సన్నివేశాలు ఉన్నాయని కూడా అంటున్నారు ప్రేక్షకులు.  మొత్తానికి  ‘సమ్మోహన్ం’ హిట్టా..ఫట్టా అన్న విషయం రేపటి వరకు తెలిసిపోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: