అవును బిగ్ బాస్ ఇప్పుడు కష్టాల్లో పడిందని అంటున్నారు..అందేంటీ తెలుగు లో బిగ్ బాస్ 2 మొదలై రెండు వారాలు కావొస్తుంది..కష్టాల్లో పడటం ఏంటా అని ఆలోచిస్తున్నారా..అబ్బే తెలుగు బిగ్ బాస్ కాదండీ..అది తమిళంలో వస్తున్న బిగ్ బాస్.  పోయినేడాది ముందుగా తమిళ ‘బిగ్ బాస్’ షో మొదలైన కొన్ని రోజులకు తెలుగు ‘బిగ్ బాస్’ మొదలైంది. ఈసారి ముందు తెలుగు ‘బిగ్ బాస్’ మొదలైతే.. తమిళ షో కొన్ని రోజులు లేటుగా ఆరంభమైంది.  ‘ఖుషీ’ భామ ముంతాజ్ లాంటి హాట్ బాంబ్ ఈసారి షోలో పాల్గొంటుండటం అక్కడి జనాల్లో క్యూరియాసిటీ తెస్తోంది.
Image result for big boss tamil
ఐతే ఈ షో ఆరంభంలోనే ఒక వివాదంలో చిక్కుకుంది. ఈ షో విషయంలో ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఫెఫ్సి) అభ్యంతరం వ్యక్తం చేసింది. తమిళ ‘బిగ్ బాస్’ షో కోసం 70 శాతం మంది ముంబయి వాళ్లే పని చేస్తున్నారని ఆ సంస్థ ఆరోపించింది. నిబంధనల ప్రకారం 50 శాతానికి మించి బయటి వాళ్లు పని చేయడానికి వీల్లేదని.. ఐతే ఏకంగా 70 శాతం మంది ముంబయి వాళ్లను తెచ్చి ఈ షో కోసం పని చేయించుకుంటున్నారని.. దీని వల్ల స్థానికులకు అన్యాయం జరుగుతోందని ఆ సంస్థ ఆరోపించింది.
Image result for big boss tamil
ఈసారి కూడా నిబంధనల్ని అతిక్రమించి షో నిర్వాహకులు స్థానికేతరులతో ప్రొడక్షన్ వర్క్  చేయించుకుంటున్నారని.. ఇది ఆగకపోతే షోను ఆపేస్తామని ఆ సంస్థ హెచ్చరించింది. గతంలో బిగ్ బాస్ కి ఇదే సమస్య వస్తే..కమల్ హాసన్ పర్సనల్ గా జోక్యం చేసుకొని వివాదాన్నిఆపారు.  మరి ఈసారి బిగ్ బాస్ కార్యక్రం సజావుగా సాగుతుందా..కష్టాల్లో పడుతుందా చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: