వెంకటేష్ వరుణ్ తేజ్ లు తోడళ్ళులుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’ ( ఫన్ అండ్ ప్రస్ట్రేషన్) చిత్రం నిన్న లాంఛనంగా ప్రారంభమైంది. అల్లు అరవింద్ దిల్ రాజ్ లు నిర్మిస్తున్న ఈమూవీ పూర్తి వినోదాత్మక సినిమాగా రూపొందబోతోంది. అనీల్ రావిపూడి ఈసినిమాకు ఒక వెరైటీ కథను సమకూర్చినట్లు వార్తలు వస్తున్నాయి. 
Venkatesh-Varun-Tej-F2-Movie-Launch-Photos (1)
చాలా గ్యాప్ తరువాత సినిమా షూటింగ్ కోసం కొత్త లుక్ తో నిన్న ఈమూవీ ప్రారంభోత్సవంలో వెంకటేష్ ను చూసిన చాలామంది షాక్ అయినట్లు సమాచారం. ‘గురు’ సినిమా కోసం కాస్త ఏజ్డ్ లుక్ తో కండలు తిరిగిన బాడీతో కనిపించిన వెంకీ ఇప్పుడు పూర్తిగా గెడ్డం తీసేసి ఫుల్ బ్లాక్ హెయిర్ తో కనిపించడమే కాకుండా వెంకటేష్ తన వయసుకు తగ్గట్టుగా కాకుండా బాగా స్లిమ్ గా మారి ఫ్రెష్ లుక్ లో కనిపించాడు. 

అయితే ఈ సినిమాలో వెంకటేష్ తో కలిసి నటిస్తున్న వరుణ్ తేజ్ వ్యవహారం మాత్రం రివర్స్ గేర్ లో ఉంది అన్న కామెంట్స్ వినిపించాయి. ఈమధ్య వరస సినిమాలతో బిజీగా ఉన్న వరుణ్ తేజ్ గతంలో కన్నా కొద్దిగా లావుగా కనిపించడమే కాకుండా మొఖంలో బుగ్గలు కూడ బాగా ఉబ్బి ఉండటంతో వరుణ్ తేజ్ కు ఏమైంది అంటూ ఆ మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన చాలామంది ఒకరికొకరు గుసగుసలాడుకున్నట్లు టాక్. 
Venkatesh and Varun Tej
దీనితో వెంకటేష్ పెరిగాడు వరుణ్ తగ్గాడు అంటూ కొందరు కామెంట్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈసినిమాకు వెంకటేష్ వరుణ్ తేజ్ లు ఇద్దరూ హీరోలే అయినా ‘ఫిదా’ సూపర్ సక్సస్ తో ఈమూవీకి సంబంధించి వెంకటేష్ కంటే వరుణ్ తేజ్ కి ఎక్కువ పారితోషికం ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పారితోషికంలో ఎలా ఉన్నా లుక్ లో మాత్రం వెంకటేష్ స్ట్రాటజీ ముందు వరుణ్ తేజ్ తగ్గాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: