తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై నెల రోజులు వివిధ ఛానల్స్ లో ఇంటర్వ్యలు ఇస్తూ ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేస్తూ తెగ హల్ చల్ చేసింది నటి శ్రీరెడ్డి.  తనకు మా అసోసియేషన్ వారు కార్డు ఇవ్వడం లేదని ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేసింది. దాంతో జనాల్లో ఒక్కసారే సింపతి పెరిగిపోయింది..ఆమెకు మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు అండగా ఉంటామని వచ్చారు.  దాంతో తన బలం పుంజుకున్న శ్రీరెడ్డి కొన్ని ఛానల్స్ లో డిబెట్ పెట్టి సినీ ఇండస్ట్రీ వారిని టార్గెట్ చేసుకొని ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేసింది. 
Image result for sri reddy
ఇదిలా ఉండగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి అందరి ఆగ్రహానికి గురైంది. అప్పటి వరకు ఆమెకు ఇచ్చిన సపోర్ట్ ఒక్కసారే వెనక్కి తీసుకున్నారు.  దాంతో శ్రీరెడ్డి తాను తీసుకున్న గోతిలో తానే పడిందని కామెంట్స్ వినిపించాయి.  ఇలా అయితే ఆమె వెంట ఎవ్వరూ వుండరు , ఆమె చేసే పనులు ఆమెనే సమాజ బహిష్కరణ వైపు తరిమేట్టున్నాయి.. అంటూ వినిపిస్తున్న  శ్రీరెడ్డి సానుభూతిపరుల మాటలు ఆమె తాజా అవస్థను తెలియజేస్తున్నాయి. 
Image result for sri reddy
ఇదిలా ఉంటే..అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ బైటపడ్డ నేపథ్యంలో శ్రీరెడ్డి పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్.. ఆమెను ఈ విధంగా కార్నర్ చేస్తోంది.అమెరికాలో వీళ్ళు బాగా పెర్ఫామ్ చేస్తారు  అంటూ ఇటీవల 34 మంది ఫిమేల్ సెలబ్రిటీల పేర్లను బయటపెట్టింది శ్రీరెడ్డి.  ఆమె పేర్కొన్న ఆ 34 మంది ఆడవాళ్లు మానసిక క్షోభకు గురవుతున్నారని, తప్పు చేశారో లేదో తేలకముందే వాళ్ళ వివరాలు బహిర్గతం కావడం దారుణమైన విషయమని సామాజికవేత్తలు వాదిస్తున్నారు.అంతకుముందు.. కాస్టింగ్ కౌచ్ అంశంపై శ్రీరెడ్డి చేసిన పోరాటానికి బాసటగా నిలిచిన మహిళా సంఘం నేత సంధ్య, సామాజిక జర్నలిస్ట్ సజయ కాకర్ల లాంటి వాళ్లంతా ఇప్పుడు శ్రీరెడ్డి వైపు తమ విమర్శన బాణాలు ఎక్కుపెడుతున్నారు.
Image result for sri reddy womens support
బాధిత మహిళల విషయంలో మీడియా సైతం గోప్యత పాటించేలా తాము ఒత్తిడి తీసుకొస్తుంటే.. ఈ అమ్మాయి చివరకు ఇలా చేసిందేమిటి? దాదాపు సగం తెలుగు గ్లామర్ ప్రపంచాన్ని తలెత్తుకోనివ్వకుండా చేసిన శ్రీరెడ్డిని ఈ విషయంలో క్షమించే ప్రసక్తే లేదు.. అంటూ సౌండ్ పెంచుతున్నారు.  వాళ్ళందరూ సాటి ఆడవాళ్లన్న కనీస సానుభూతి కూడా లేకపోయింది శ్రీరెడ్డికి..  అన్నది సామాజికవేత్తల సీరియస్ అవుతున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: