కలుషితమవడానికి కారణమవుతున్న తమిళనాడులోని తూత్తుకుడి (ట్యూటికోరిన్) స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని మూసివేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు చేస్తున్న ఆందోళన మంగళవారం హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులను అదుపుచేయడానికి పోలీసులు జరిపిన కాల్పు ల్లో 11 మంది మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు.  ఈ ఘటన యావత్ భారత దేశంలో పెద్ద సంచలనంగా మారింది. 
Image result for tamil actress nilani
తమిళ సెలబ్రెటీలు పోలీసులు వ్యవహారంపై ఫైర్ అయ్యారు.  రజినీ, కమల్, విజయ్ ఇలా పలువురు నటులు తుత్తుకుడి ఘటనపై స్పందించారు. అయితే పోలీసులు వ్యవహారాన్ని నిరసిస్తూ తమిళ నటి నీలాణి పోలీసు వేషం వేసుకుని విమర్శించడంపై ప్రభుత్వం ఆగ్రహించింది.  ఆమెపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. తాజాగా తూత్తుకుడి కాల్పులపై విమర్శలు చేసి జైలుకు వెళ్లిన తమిళ నటి నీలాణికి సైదాపేట కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.
Image result for tamil actress nilani
నీలాణి పోలీస్ వేషంలో కనిపించి విమర్శలు గుప్పిస్తూ, కాల్పుల దృశ్యాలను చూపించగా, ఆ వీడియో వైరల్ అయింది. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు అందగా, 19వ తేదీన పోలీసులు అరెస్ట్ చేసి పుళల్ జైలుకు తరలించారు. బెయిల్ కోసం ఆమె దరఖాస్తు చేసుకోవడంతో, నగరం వదిలి వెళ్లవద్దని, పోలీసుల విచారణకు సహకరించాలని షరతులు విధిస్తూ సైదాపేట న్యాయమూర్తి బెయిల్ ను మంజూరు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: