తెలుగు ఇండస్ట్రీలో సినీ నిర్మాత, వ్యాపారవేత్త, పొలిటీషియన్, కళాబంధు టి.సుబ్బారామిరెడ్డి ఏది చేసినా అది పెద్ద సెన్సేషన్ అవుతుంది.  సినీ రంగానికి ఎన్నో సేవలు చేసిన ఆయన మరో వేడుకతో సందడి చేశారు. టి.సుబ్బారామిరెడ్డి మనవడి పెళ్లి వేడుక హైదరాబాద్‍‌లోని హెచ్ఐసిసలో అట్టహాసంగా జరుగుతోంది.

  ఈ సందర్బంగా వేడుకలో పాల్గొనెందుకు  రాజకీయ ప్రముఖులు, బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు హైదరాబాద్‌లో విచ్చేశారు.  పెళ్లి వేడుకలో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన సంగీత్ సెర్మీనీలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. 

ఇక వివాహ వేడుకకు అనిల్ కపూర్, ఐశ్వర్యరాయ్, శతృజ్ఞ సిన్హా, బోనీ కపూర్, ఐశ్వర్య రజనీకాంత్, నాగార్జున, రామ్ చరణ్, ఉపాసన, రాఘవేంద్రావు, బ్రహ్మానందం, జయప్రద, అలీ, అల్లు అరవింద్, వైజయంతిమాల, బి సరోజదేవి, టాప్ పొలిటీషియన్స్, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు.

సుబ్బిరామిరెడ్డి మనవడు అనిరుధ్ (సరిత-సందీప్ రెడ్డి కుమారుడు) వివాహం నేహ(హితా-నవీన్ రెడ్డి కుమార్తె.... సుభ-జి రామ్మోహన్ రెడ్డి & జి.వెంకట రామిరెడ్డి మనవరాలు)తో జులైన 1న హైదరాబాద్‌లోని హెచ్ఐసిసిలో జరుగబోతోంది. ఉదయం 10.26 గంటలకు పెళ్లి ముహూర్తం నిర్ణయించారు.

ఐశ్వర్య రజనీకాంత్

అనిల్ కపూర్ కుటుంబం

దర్శకేంద్రుడు



మరింత సమాచారం తెలుసుకోండి: