తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నాగచైతన్యం.  ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.  అయితే ‘రారండోయ్ వేడుక చేద్దాం’ తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోవడం కెరీర్ పరంగా డౌట్ లో పడ్డాడు నాగ చైతన్యం.  ప్రస్తుతం కామెడీ ఓరియెంటెడ్ గా వచ్చే చిత్రాలకు మంచి ప్రాధాన్యత ఉండటంతో కామెడీ దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు.  అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇంకా రాకపోవడంతో అభినులు కాస్త నిరుత్సాహంలో ఉన్నారు. 
Image result for shailaja alludu
కాకపోతే సవ్యసాచి కారణంగా ఆ లుక్ లేట్ అవుతూ వస్తోంది. అయితే ఇదిగో వస్తోంది, అదిగో వస్తోందంటూ ఊరింపులు మాత్రం ఆగలేదు. దీన్ని ఓ ఆకతాయి క్యాష్ చేసుకున్నాడు. "ఫ్యాన్స్ కు సడెన్ సర్ ప్రైజ్.. ఇదే శైలజారెడ్డి అల్లుడు సినిమాలో చైతూ ఫస్ట్ లుక్. ఎంజాయ్ ఫోక్స్" అంటూ ఓ లుక్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.  ఇంకేముంది..ఫ్యాన్స్ తెగసంబరపడిపోయారు.   
Image result for shailaja alludu
దాంతో  రీట్వీట్లు, ఒకటే లైకులు, షేర్లు. దాదాపు ఓ గంట పాటు అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కానీ ఒక్కసారే షాకింగ్ వార్త విన్నారు..వాస్తవానికి  శైలజారెడ్డి అల్లుడు ఫేక్ ఫస్ట్ లుక్ అంటూ ఫిలిమ్ మేకర్స్ అన్నారు.   స్వయంగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ ట్విట్టర్ పేజ్ లో దీనిపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత."ప్రస్తుతం శైలజారెడ్డి అల్లుడు ఫస్ట్ లుక్ అంటూ చక్కర్లు కొడుతున్న స్టిల్ తో మాకు ఎలాంటి సంబంధం లేదు. అది ఫేక్ స్టిల్. మరో వారం రోజుల్లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాం. దయచేసి ఫేక్ స్టిల్ షేర్ చేయొద్దు." ఫేక్ లుక్ అయినా ఫస్ట్ లుక్ అయినా స్టిల్ అదిరిందంటున్నారు ఫ్యాన్స్. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: