పవన్ కళ్యాణ్‌ కు తుపాకీ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిన విషయమే. తుపాకీల పట్ల తనకు ఉండే ప్రత్యేకమైన ప్రేమతో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో రకరకాల తుపాకీలు ఉపయోగిస్తూ తన అభిమానులకు జోష్ ను ఇవ్వడానికి ప్రయత్నించాడు. పవన్ తుపాకీ పట్టుకుని ఫైట్స్ లో పాటలలో విన్యాసాలు చేస్తుంటే అతడి అభిమానులు ధియేటర్లలో రెచ్చిపోతారు. 
అందుకే సీపీఎఫ్ పెట్టాను
ప్రస్తుతం సినిమాలు వదిలి రాజకీయాల నిమిత్తం పోరాట యాత్ర చేస్తున్న పవన్ నిన్న తన విశాఖ పర్యటనలో తుపాకీ ప్రస్తావన తీసుకు వచ్చి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.   తనకు చిన్నతనం నుండి తుపాకీలు అంటే చాల ఇష్టం అనీ ఈ అభిరుచితో తాను తుపాకీ కోసం నక్సలైట్ గా మారిపోతానేమో అన్న భయంతో చిరంజీవి తనకు ఒక తుపాకీ కొని ఇచ్చిన ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు పవన్. 
 మా ఇంట్లో వారు కూడా అర్థం చేసుకోలేదు, వారికి మాత్రమే అర్థమయ్యాను..
అయితే ఆరోజు తనకు ఉన్న మోజు తుపాకీని సొంతం చేసుకోవాలన్న కోరిక కాదనీ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాల మీద తిరుగుబాటు చేయాలన్న కోరిక అనీ అయితే ఆవిషయాలు తన అన్న చిరంజీవికి తాను వివరించలేకపోయాను అంటూ కామెంట్స్ చేసాడు జనసేనాధిపతి.  అయితే ఆతరువాత తన అన్నయ్య కొనిచ్చిన రివాల్వర్ తీసుకున్నాక దానిపై విపరీతమైన ప్రేమ ఏర్పడింది అన్న విషయాన్ని బయట పెడుతూ తన జీవితంలో ఫస్ట్ లవ్ ఎఫైర్ అనేది రివాల్వర్ తోనే మొదలైంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.
 ఆరోజు అన్నయ్యకు చెప్పలేక పోయా
అంతేకాదు ఆ రివాల్వర్ ను తన జేబులోనే పెట్టుకుని తిరుగుతూ రాత్రి తన పక్కలోనే పెట్టుకుని పాడుకుని నిద్ర లేవగానే తన తుపాకీని ముద్దు పెట్టుకున్న విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. ఒక సామాజిక మార్పు కోసం తాను రాజకీయాలలోకి వచ్చాను అంటూ ఆవేశంతో ఊగిపోతూ మధ్యలో ఈ తుపాకీ కథను వివరిస్తూ ఆవేశంగా పవన్ చేసిన ఉపన్యాసాన్ని అత్యంత ఆసక్తితో అభిమానులు విన్నారు. అయితే తాను అధికారంలోకి వస్తే జనంకు ఏమి చేస్తాడో ఇప్పటికి ఒక్కసారైనా స్పష్టంగా చెప్పలేకపోతున్న పవన్ ఈ తుపాకీల ప్రస్తావన ఎందుకు తీసుకువచ్చాడో పవన్  కే తెలియాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: