ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో కామెడీ దర్శకులు కాస్త తగ్గినట్టే అనిపిస్తుంది.  అప్పట్లో జంద్యాల, ఈవివి సత్యనారాయణ కొంత మంది మంచి కామెడీ దర్శకులు తమ కామెడీతో అభిమానులను కడుపుబ్బా నవ్వించారు.  ఎలాంటి వల్గర్ కంటెంట్ లేకుండా..డైలాగ్స్ లేకుండా మనసుకు హత్తుకునే కామెడీ మార్క్ తో ప్రేక్షకుల మనసు దోచారు.  కానీ ఈ మద్య కామెడీలో వల్గర్ కంటెంట్ ఎక్కువగా వస్తుందని కామెంట్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే.  ఇదిలా ఉంటే మంచి కామెడీ దర్శకుడిగానే కాదు..నిర్మాతగా కూడా మారుతి తన సత్తా చాటుతున్నాడు. 
Image result for director maruthi
తన సినిమాలకి మాత్రమే కాకుండా .. ఇతరుల సినిమాలకి కూడా ఆయన కథలను అందిస్తుంటాడు. ఆయన కథను అందించిన చిత్రంగా 'బ్రాండ్ బాబు' రూపొందుతోంది. శైలేంద్ర నిర్మాణంలో ..ప్రభాకర్.పి దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. సుమంత్ శైలేంద్ర .. ఈషా రెబ్బా జంటగా నటిస్తోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తీస్తాడని మారుతికి మంచి పేరుంది.

మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ రోజుల్లో, భలే భలే మగాడివోయ్ చిత్రాలు మంచి విజయం అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అందించిన కథతో వస్తున్న 'బ్రాండ్ బాబు'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో టీజర్ ను విడుదల చెయ్యబోతున్నారు.  యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తీస్తాడని మారుతికి మంచి పేరుంది.  నటీనటులు: సుమంత్ శైలేంద్ర, ఇషా రెబ్బ, మురళి శర్మ, పూజిత పొన్నాడ, రాజా రవీంద్ర, సత్యం రాజేష్, వేణు వై, నలీన్, పి. సాయి కుమార్, కోటేష్ మన్నవ, కిరణ్. సాంకేతిక నిపుణులు: స్టోరి: మారుతి డైరెక్టర్: ప్రభాకర్.పి నిర్మాత: ఎస్. శైలేంద్ర బ్యానర్: శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ మ్యూజిక్: జేబి లిరిక్స్: పూర్ణచెర్రీ కెమెరామెన్: కార్తీక్ ఫలణి ఎడిటర్: ఉద్ధవ్ ఎస్.బి ఆర్ట్ డైరెక్టర్: మురళి ఎస్.వి పి ఆర్ ఓ: వంశీశేఖర్ 

మరింత సమాచారం తెలుసుకోండి: