రొమాంటిక్ సీన్స్, హీరోయిన్, సినిమాటోగ్రఫీరొమాంటిక్ సీన్స్, హీరోయిన్, సినిమాటోగ్రఫీస్క్రీన్ ప్లే, మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్, రొటీన్ స్టోరీ ప్లాట్
అమ్మనాన్న లేని శివ (కార్తికేయ)ని డాడీ (రాంకీ) పెంచుకుంటాడు. రాంకీ ఊరి ప్రెసిడెంట్ విశ్వనాథం (రావు రమేష్) దగ్గర పనిచేస్తుంటాడు. విశ్వనాథం చేసే పనులు నచ్చక అతనితోనే గొడవలు పడుతుంటాడు. మరో పక్క విశ్వనాథం కూతురు ఇందు (పాయల్ రాజ్ పుత్) శివ ప్రేమలో పడుతుంది. ఇద్దరు పీకల్లోతు ప్రేమలో ఉంటారు. ఈ విషయం తెలిసిన రాంకీ వారికి ప్రేమకు సపోర్ట్ చేయగా.. విశ్వనాథం మాత్రం శివని బంధించి ఎన్నారైతో ఇందుకి పెళ్లి చేస్తాడు. ఇందు పెళ్లి తర్వాత శివ ఏం చేశాడు..? శివ, ఇందు మళ్లీ కలిశారా..? విశ్వనాథం మీద శివ తన పగ ఎలా తీర్చుకున్నాడు అన్నది సినిమా కథ.



కార్తికేయ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకున్నాడు. లవ్, ఎమోషన్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. హీరోయిన్ డామినేషన్ అంటే ఏంటో చూపించింది. లిప్ లాక్ సీన్స్ అయితే దుమ్మురేపింది. ఇలా ఏ హీరోయిన్ చేయదేమో అన్న రేంజ్ లో రెచ్చిపోయింది. ఇక రాంకీ తన పాత్రకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు. చాలా రోజుల తర్వాత తెలుగు తెర మీద కనిపించాడు రాంకీ. రావు రమేష్ తన పాత్రలో అలరించాడు. మిగతా వారంతా పరిధి మేరకు నటించి మెప్పించారు.

సినిమాటోగ్రఫీ బాగుంది.. చైతన్య భరధ్వాజ్ పాటలు అలరించాయి. స్మరన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. కథ, కథనాల్లో దర్శకుడు పర్వాలేదు అనిపించాడు. కథనంలో దర్శకుడు పొరపాట్లు చేశాడనిపిస్తుంది. ఎడిటింగ్ జస్ట్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

యధార్ధ సంఘటన ఆధారంగా రాసుకున్న సినిమాగా ఆరెక్స్ 100 మూవీ వచ్చింది. సినిమా టీజర్ తోనే అంచనాలు ఏర్పరచగా అర్జున్ రెడ్డి తర్వాత అలాంటి ఇంటెన్స్ లవ్ స్టోరీగా వచ్చింది ఆరెక్స్ 100. దర్శకుడు కథ ఫ్లాట్ గా రాసుకున్నా కథనంలో మేజిక్ చేయలేదు. మొదటి భాగం మొత్తం హీరోయిన్స్ తో ముద్దులాట సెకండ్ హాఫ్ హీరో రివెంజ్ డ్రామా అంతా ఏదో అలా సాగిపోతుంది. 

యూత్ ఆడియెన్స్ మెప్పించే లవ్ సీన్స్ కాస్త ఘాటు ముద్దులతో నింపేశారు. హీరోయిన్ క్యారక్టర్ రాసుకున్న తీరు ఆకట్టుకుంటుంది. ఇంత బోల్డ్ గా అమ్మాయిలు ఉంటారా అన్న ఆలోచన వస్తుంది. సినిమా మొదలవడం బాగానే అనిపిస్తుంది. కాని చివరి 20 నిమిషాలే అసలైన సినిమా నడుస్తుంది. 

చాలా చోట్ల అర్జున్ రెడ్డిని ఫాలో అయినట్టుగా అనిపిస్తుంది. అయితే అందులో లవ్ ఫెయిల్ అయిన హీరో డాక్టర్ గా మారుతాడు ఇందులో కూడా తానేం చేస్తున్నాడో అర్ధం కాని విధంగా చేస్తాడు. ఫైనల్ గా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రం మెప్పించేశాడు దర్శకుడు. 
Kartikeya,Payal Rajput,Ajay Bhupathi,Ashok Reddy Gummakonda,Chaitan Bharadwajఆరెక్స్ 100.. ఆకట్టుకోలేని ప్రయత్నం..!

మరింత సమాచారం తెలుసుకోండి: