మొదట సినిమాల్లో హీరోయిన్ పక్కన ఫ్రెండ్ పాత్రల్లో నటించిన రష్మి గౌతం కొన్ని సినిమాలు చేసినా అంత గుర్తింపు రాకపోవడంతో బుల్లితెరకు షిఫ్ట్ అయ్యింది. జబర్దస్త్ షోతో మస్త్ జబర్దస్త్ క్రేజ్ తెచ్చుకున్న రష్మి ఆ పాపులారిటీతో గుంటూర్ టాకీస్ సినిమాలో నటించింది. ఆ సినిమాలో అమ్మడి అందాలకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.  


రొమాంటిక్ ఎంటర్టైనర్ జానర్ లో వచ్చిన గుంటూర్ టాకీస్ మూవీతో రష్మి మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఇక వరుస సినిమాల్లో అదే రకమైన పాత్రలతో అలరించింది అమ్మడు. ఇన్నాళ్లు వయసు దాచిపెడుతూ వచ్చిన ఈ అమ్మడు ఓ టాక్ షోలో తన వయసు చెప్పక తప్పలేదు. సంవత్సరం క్రితమే అమ్మడి వయసు 38 అని చెప్పింది.


అంటే ఇప్పుడు 39 అన్నట్టు.. అయినా సరే ఈ వయసులో కూడా అమ్మడి అందాలతో వెర్రివాళ్లను చేస్తుంది. ప్రస్తుతం అంతకుమించి సినిమాలో నటిస్తున్న రష్మి ఆ సినిమా టీజర్ తో మరోసారి మనసులను దోచేసింది. ఇంతకుముందు సినిమాలు ఎలా ఉన్నా ఈ అంతకుమించి సినిమాలో మాత్రం ఊహలకు మించి అందాలు ఆరబోస్తుందని తెలుస్తుంది.


చూస్తుంటే రష్మి మళ్లీ మరోసారి రచ్చ చేయడం ఖాయమని చెప్పొచ్చు. మరోసారి మతిపోగొట్టే అందాలతో అదరహో అనిపించింది రష్మి గౌతం. హర్రర్ నేపథ్యంతో వచ్చే ఈ సినిమాలో అమ్మడి అందాలే పెట్టుబడిగా పెడుతున్నారు దర్శక నిర్మాతలు. సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమా మరో గుంటూర్ టాకీస్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. జై, రష్మి గౌతం నటించిన ఈ సినిమాను జై డైరక్షన్ లో వస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: