ఈ మాట అంటుంది ఎవరో కాదు గౌతమి పుత్ర లాంటి చారిత్రాత్మక చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన దర్ధకుడు రాధాకృష్ణ జాగర్లమూడి అలియాస్ క్రిష్.  ప్రస్తుతం ఆయన నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతుంది.  అయితే ఈ చిత్రంలో మరో సెన్సేషన్ కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.  నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాలీవుడ్ లో టాక్.

Image result for ntr biopic

దానికి కారణం ఆ మద్య అక్కినేని కుర్రోడు అఖిల్ డైరెక్ట్ హీరోగా కాకుండా అక్కినేని మూడు తరాలు కలిసి నటించిన ‘మనం’ చిత్రంలో క్లయిమాక్స్ లో దుమ్మురేపాడు.  దాంతో అఖిల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో నందమూరి కుర్రోడు మోక్షజ్ఞ ని కూడా డిఫరెంట్ స్టైల్లో లాంచ్ చేయాలని దర్శకులు క్రిష్ భావిస్తున్నారట. అయితే మోక్షజ్ఞకు ఎలాంటి పాత్ర ఇస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది.

Image result for balakrishna son mokshagna

ఎందుకంటే, సినిమాలో దాదాపు కీలకమైన పాత్రలన్నింటినీ బాలయ్యే పోషిస్తున్నాడు.  నిజానికి బాలయ్య వందోచిత్రం గౌతమీపుత్ర శాతకర్ణితోనే మోక్షజ్ఞను తెరపైకి తీసుకురావాలనుకున్నారు.  కానీ బాలకృష్ణ వద్దని సున్నతంగా తిరస్కరించారట. మరి ఈసారి క్రిష్ సక్సెస్ అవుతాడా..? మోక్షజ్ఞను లాంఛ్ చేసే అవకాశం దక్కించుకుంటాడా..? 

మరింత సమాచారం తెలుసుకోండి: