తెలుగు ఇండస్ట్రీలో తన మధుమైన గానంతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టిన సింగర్ సునిత.  కేవలం తన పాటలతోనే కాదు యాంకరింగ్ తో కూడా ఆకట్టుకుంటుంది.  అయితే వెండితెరపై, బుల్లితెరపై కొంత మంది నటీ,నటుల జీవితాలో తెరపై కనిపించినంద అందమైన జీవితాలు కావు..వారి రియల్ లైఫ్ లో ఎన్నో కష్టాలు కన్నీళ్లు ఉన్నాయి.  అలాంటి ఇబ్బందులు సింగర్ సునితకు సైతం ఉన్నాయని పలుమార్లు ఇంటర్వ్యూలో చెప్పి బాధపడింది.  

Image result for singer sunitha

తన వైవాహిక జీవితంతో ఎన్నో ఛేదు అనుభవాలు ఎదురయ్యాయని ప్రస్తుతం తన పిల్లలే తన జీవితం అని..తన భర్త నుంచి దూరమైనట్లు తెలిపింది.  వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆమె ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కున్నారు. తాజాగా ఆమెకు సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  సునిత త్వరలో పెళ్లి చేసుకోబోతుందట. అయితే ఆమె భర్త ఎవరూ? అన్న విషయం ఇంకా క్లారిటీ రాలేదు. చిన్నతనంలోనే ఇండస్ట్రీకి వచ్చిన ‘సునీత ఉపద్రష్ట’.. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కూడా 750కిపైగా చిత్రాలకు పని చేశారు. 

Image result for singer sunitha children's

 19 ఏళ్ల వయసులోనే కిరణ్‌ అనే వ్యక్తిని పెళ్లాడిన సునీతకు ఇద్దరు పిల్లలు. అయితే వ్యక్తిగత కారణాలతో ఆమె భర్త నుంచి చాలా ఏళ్ల క్రితమే విడిపోయారు. గతంలో తనకు ద్వితీయ వివాహంపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్పిన సునిత బహుషా మనసు మార్చుకుందేమో అని టాక్ వినిపిస్తుంది.  ఏది ఏమైనా ఈ మద్య సోషల్ మీడియాలో రూమర్లు బాగా వస్తున్న నేపథ్యంలో సింగర్ సునిత ద్వితీయ వివాహం కూడా రూమరే అని కొంత మంది కొట్టేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: