'ఆర్ ఎక్స్ 100' .. దర్శకుడు .. హీరో హీరోయిన్లు కొత్తవాళ్లు కావడంతో, విడుదలకి ముందు ఎలాంటి అంచనాలు వేసుకోలేదు.  అంతే కాదు ఈ సినిమా విడుదలైన సమయంలోనే విజేత, చినబాబు లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి.  చాలా చిన్న సినిమాగానే థియేటర్లకు వచ్చిన 'ఆర్ ఎక్స్ 100' భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. తొలి రోజున తొలి ఆటతోనే యూత్ అంతా కలిసి ఈ సినిమాకి హిట్ ముద్ర వేసేశారు. 

Image result for ఆర్ ఎక్స్ 100 కలెక్షన్స్

ఈ తరం కుర్రకారు కోరుకునే అంశాలతో అల్లిన కథ కావడంతో, వాళ్లకు ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది.యూత్ కావ‌ల‌సిన అన్ని మ‌సాలాలు వేసి ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి తీసిన ఆర్ ఎక్స్ 100 మూవీ క‌లెక్ష‌న్స్ లో దూసుకుపోతున్న‌ది.  హీరో హీరోయిన్స్ ఇద్ద‌రూ కొత్త‌వారైనా ఓపెనింగ్స్ అదిరేలా వ‌చ్చాయి.. బోల్డ్ కంటెంట్ ఉన్న ఈ మూవీని చూసేందుకు యూత్ ధియేట‌ర్ల వ‌ద్ద క్యూక‌డుతున్నారు.. ఇప్ప‌టికే బ్రేక్ ఈవేన్ సాధించిన ఈ మూవీ ఇక పై వ‌చ్చే క‌లెక్ష‌న్స్ అంతా లాభాలతోనే కంటిన్యూ అవుతుంది.  

RX 100 six days collections

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఆర్ ఎక్స్ 100 మంచి కలెక్షన్లు రాబడుతుంది.  మొదటి వారంలో ఈ సినిమా మొత్తంగా రూ.7.53 కోట్లు(షేర్) వసూలు చేసి...నిర్మాతలకు - డిస్ట్రిబ్యూటర్లకు  లాభాలు తెచ్చిపెట్టింది. అన్ని ఖర్చులు కలుపుకొని 2.5 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం....థియాట్రికల్ రన్ లో 15 కోట్లకు మించి వసూలు చేయవచ్చని ట్రేడ్ విశ్లేషకుల అంచనా.


ఏరియా వైజ్ గా కలెక్షన్లు : 
నైజాం- 33.66 లక్షలు
సీడెడ్ -7.62 లక్షలు
వైజాగ్- 6.43 లక్షలు
ఈస్ట్ - 3.71 లక్షలు
వెస్ట్ - 3.90 లక్షలు
కృష్ణా - 3.61 లక్షలు
గుంటూర్ - 3.48 లక్షలు
నెల్లూర్ -1.73 లక్షలు
మొత్తం మొదటి వారం షేర్ - 7.53 కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: