దర్శకుడు హరీష్ శంకర్ దిల్ రాజ్ పై ఎన్నో ఆశలు పెట్టుకుని గత సంవత్సర కాలంగా కష్టపడి తయారుచేసిన ‘దాగుడుమాతలు’ మూవీ స్క్రిప్ట్ పై దిల్ రాజ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ కామెంట్స్ చేయడం హరీష్ శంకర్ కు జీర్ణించుకోలేని వాస్తవంగా మారింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈరోజు విడుదల అయిన రాజ్ తరుణ్ ‘లవర్’ సినిమాను ప్రమోట్ చేస్తూ దిల్ రాజ్ హరీష్ శంకర్ ఆశలను నీరు కార్చాడు.
Dictator Theatrical Rights Acquired By Dil Raju
తాను నిర్మించబోయే సినిమాల లిస్టును మీడియాకు వివరిస్తూ హరీష్ శంకర్ తో తాను తీయాలి అనుకున్న మూవీ ప్రాజెక్ట్ కథలో క్లారిటీ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ను వదులుకుంటున్నట్లు దిల్ రాజ్ లీకులు ఇచ్చాడు. ఈసినిమాకోసం హరీష్ శంకర్ కథ విషయంలో కష్టపడటమే కాకుండా ఈమధ్యనే లోకేషన్స్ ఎంపిక కోసం అమెరికా కూడ వెళ్ళి వచ్చాడు హరీష్ శంకర్.   
Dagudu muthalu with Multistarrer
అయితే దిల్ రాజ్ ప్రకటించిన 5 సినిమాల లిస్టులో హరీష్ శంకర్ కు స్థానం లేకపోవడానికి గల కారణం దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమధ్య ఇంద్రగంటి మోహన్ కృష్ణ దిల్ రాజ్ ను కలిసి వినిపించిన ఒక మల్టీ స్టారర్ కథ దిల్ రాజ్ కు బాగా నచ్చడంతో ఈకథ కోసం హరీష్ శంకర్ ‘దాగుడుమూతలు’ కథను పక్కకు పెట్టాడు అని టాక్. 
Interview Stills Mohan Krishna Indraganti about Ami Tumi
దీనికితోడు ఇంద్రగంటి దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘సమ్మోహనం’ కు ప్రశంసలతో పాటు విజయం కూడ దక్కడంతో పరాజయాల బాటలో నడుస్తున్న హరీష్ శంకర్ కన్నా ఇంద్రగంటితో వెళ్ళడం మంచిది అన్న అభిప్రాయం దిల్ రాజ్ కు ఉంది అని అంటారు. నాని శర్వానంద్ లతో మల్టీ స్టారర్ గా తీయబోతున్న ఈమూవీకి మంచి మార్కెట్ ఇంద్రగంటి ఇమేజ్ వల్ల వస్తుందని దిల్ రాజ్ ఆలోచన అని అంటున్నారు. ఏమైనా ఇంద్రగంటి హరీష్ శంకర్ కు శాపంగా మారాడు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: