బాలీవుడ్ స్టార్ నటి సన్నీలియోన్ తన జీవిత కథ ఆధారంగా రూపొందించిన కరన్‌జీత్ కౌర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్’ వెబ్ సిరీస్‌ సంచలనం అయింది. ఇండో కెనడా భామ సన్నీలియోన్ పోర్న్ స్టార్ గా పలు అడల్ట్ చిత్రాల్లో నటించింది. పోర్న్ స్టార్ గానే బాగా పాపులర్ అయింది. సన్నిలియోన్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమెని నిర్మాతలు బాలీవుడ్ కు తీసుకుని వచ్చారు. ఇక పోర్న్ చిత్రాలకు ఫుల్ స్టాప్ పెట్టి బాలీవుడ్ పై దృష్టి పెట్టడంతో సన్నీలియోన్ తక్కువ సమయంలోనే స్టార్ సెలేబ్రిటిగా మారిపోయింది.

ఆన్‌లైన్‌లో లీక్

 నిమిషాల వ్యవధిలో సాగె ఐటమ్ సాంగ్ కు సైతం కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే నటిగా సన్నీలియోన్ మారిపోయింది.   టీనేజ్ లో వున్నప్పుడు సన్నీ తొలిసారిగా ఓ పోర్న్ సినిమా (నీలి చిత్రం) చూసింది. ఆ తర్వాత తను తట్టుకోలేకపోయింది. ఎంత అణచిపెట్టుకున్నా కన్నీటిని బయటకు రాకుండా నియంత్రించుకోలేకపోయింది. ముఖాన్ని చేతుల్లో దాచుకుని ఏడ్చేసింది. సన్నీలియాన్ తన బయోపిక్ లో తానే నటించింది. 

ఆ సన్నివేశం గురించి

తన జీవిత చరిత్రపై తెరకెక్కిన బయోపిక్ వెబ్ సిరీస్ లో తానే నటించడం ఛాలెంజింగ్ విషయం అని సన్నీలియోన్ తెలిపింది. సినిమాలో చూపించలేని దారుణమైన సంఘటనలు కూడా తన జీవితంలో జరిగాయని సన్నీలియోన్ తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ సినిమాలో కనిపించే ప్రతీ సీనూ నిజమేనని, ప్రతీ కన్నీటి బొట్టు నిజమైనదేనని, తనదేనని వివరించింది.

Image result for sunny leone

 సన్నీ తనకు తానుగానే పోర్న్ స్టార్‌గా మారింది. సన్నీ అనేది ఆమె పేరు కాదు. ఆమె అన్నయ్య పేరు. ఆ పేరుతోనే అడల్ట్ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఆమె.. బాలీవుడ్‌లోకీ ప్రవేశించి సంచలనాలకు కారణమైంది. పోర్న్ సినిమా చూస్తేనే తప్పు అనే మైండ్ సెట్ తో ఉన్న సన్నీలియోన్ పోర్న్ చిత్రాల్లో నటించడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అనే విషయాలని ఈ వెబ్ సిరీస్ లో చూపించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: