మళయాల ప్రేమమ్ తో ఇండస్ట్రీకి పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ తెలుగులో అఆతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రేమం రీమేక్ లో కూడా నటించి మెప్పించింది. స్టార్ అవకాశాలను మిస్ అవుతూ యువ హీరోలతో జోడి కడుతున్న అనుపమ పరమేశ్వరన్ ఈ ఇయర్ చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి.


వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న నాని వేగానికి కృష్ణార్జున యుద్ధం బ్రేక్ వేసింది. ఆ సినిమాలో రుక్సర్ తో పాటుగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇక అదే కాకుండా సాయి ధరం తేజ్, కరుణాకరన్ కాంబినేషన్ లో వచ్చిన తేజ్ ఐలవ్యూ సినిమాలో కూడా అనుపమ నటించింది.


ఆ రెండు సినిమాలు అమ్మడి బ్యాడ్ లక్ కంటిన్యూ అయ్యేలా చేశాయి. అందం, అభినయం ఉన్న అనుపమకు ఎందుకు ఇలా జరుగుతుందో మరి. ప్రస్తుతం తెలుగులో రామ్ సరసన హలో గురు ప్రేమ కోసమే సినిమా చేస్తుంది. ఆ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుంది అనుపమ. ఇక ఇదే కాకుండా మొదటిసారి కన్నడలో సినిమా చేస్తుంది అమ్మడు. 


అక్కడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ తో నట సార్వభౌమ సినిమాలో నటిస్తుంది అనుపమ. ఒకవేళ ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ అయితే తెలుగులో అవకాశాలు రాకున్నా అమ్మడు కన్నడ పరిశ్రమకు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి అనుపమకు ఈసారైనా హిట్ వస్తుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: