ఈ నెలాఖరుకు ‘శైలజా రెడ్డి’ ‘నర్తనశాల’ సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీగా విడుదల అవుతున్న నేపధ్యంలో ఈరెండు సినిమాల మధ్య పోటీ నాగచైతన్య-నాగశౌర్యల మధ్య పోటీగా మారింది. ‘శైలజా రెడ్డి’ మూవీ పై ప్రీ పాజిటివ్ టాక్ ఉన్న నేపధ్యంలో ఈమూవీ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు నాగచైతన్య. 
Naga Chaitanya,Shailaja Reddy Alludu,Ramya Krishnan
ఇలాంటి పరిస్థుతులలో ఊహించని విధంగా ఇద్దరు ‘నాగ’ పేరుతో ఉన్న హీరోల మధ్య ఏర్పడిన పోటీ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఈపరిస్తుతులు ఇలా ఉండగా ఇంకా విడుదల కాకుండానే నాగశౌర్య ‘నర్తనశాలకు’ మిలియన్స్ స్తాయిలో వర్షం కురవడం నాగాచైతన్యను టెన్షన్ పెడుతున్నట్లు సమాచారం. 
The actor believes his association with director Vijay will help him learn more and open up as an actor
ఆసక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే ‘@నర్తనశాల’ టీజర్ వీడియో సాంగ్ కు విశేష ఆదరణ దక్కడం దీనికి ఉదాహరణగా అని అంటున్నారు. ‘ఇప్పటికే ఎగిరెనే మనసు’ పాటకు 7 మిలియన్ల వ్యూస్ దాటేయడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఒక చిన్న హీరో సినిమాలోని పాటకు ఈస్థాయిలో హిట్స్ రావడం రికార్డ్ అని అంటున్నారు.
Naga Shaurya
ఈమూవీలో నాగశౌర్య రొటీన్ హీరోగా నటించకుండా రిస్క్ తీసుకుని అమ్మాయి మనస్తత్వం ఉన్న అబ్బాయి పాత్రలో కొత్త తరహాగా ట్రై చేస్తున్నాడు. ఈమధ్య కాలంలో వెరైటీ సినిమాలకు ప్రేక్షకులు ఆదరిస్తున్న నేపధ్యంలో రొటీన్ మాస్ మసాలా టైప్ లో అత్తగారిని ఆడించే అల్లుడి పాత్రలో చైతూ నటిస్తున్న ‘శైలజా రెడ్డి’ పై నాగశౌర్య’ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాడా అన్న అనుమానం ఇండస్ట్రీ వర్గాలలో వినిపించడం చైతన్యను టెన్షన్ పెడుతున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: