దీపికి,క‌త్రినాల‌కి కామ‌న్ బోయ్‌ప్రెండ్ ర‌ణ్‌భీర్ క‌పూర్‌. రీసెంట్‌గా ర‌ణ్‌భీర్‌క‌పూర్, క‌త్రినా స్పెయిన్ టూర్ గురించి బాధప‌డిన దీపికా, మీడియాకు ఓ స్టేట్ మెంట్ ఇచ్చింది. 'త‌ను ఆల్రెడి ప‌బ్లిక్ ఫిగ‌ర్‌. ప‌బ్లిక్ ఫిగ‌ర్‌గా మారిన‌ప్పుడు ప్రతిది జాగ్రత్త ప‌డాలి. బీచ్‌ల‌లో ఈ విధ‌మైన బికిని ఫోటోల‌ను షూట్ చేసుకొని ఏమి తెలియ‌న‌ట్టు ప‌బ్లిష్ చేయండం అంత మంచి ప‌ద్దతికాదు. ఇటువంటి ప్రవేట్ మేట‌ర్స్‌ని సీక్రెట్‌గా జ‌రుపుకోవాల‌న్నప్పుడు ఎంతో జాగ్రత్త ప‌డాలి. ఇది కూడ మెయిన్‌టెన్ చేయ‌లేక‌పోతే ప‌బ్లిక్ ఫిగ‌ర్‌కి, కామ‌న్‌మెన్‌కి పెద్దగా తేడా ఉండ‌దు' అంటూ క‌త్రినా,ర‌ణ్‌బీర్ స్పెయిన్ టూర్‌పై విరుచుకుప‌డింది. దీనికి కౌంట‌ర్‌గా దీపికాకు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది క‌త్రినా. 'త‌ను ఇలాంటి మాట‌లు మాట్లాడం స‌రికాదు. మాట‌లు ఎంత వ‌ర‌కు మాట్లడ‌వ‌చ్చో త‌న తెలివిత‌నానికే వ‌దిలేస్తున్నాను, జాగ్రత్త' అంటూ ప‌బ్లిక్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.

వీరిద్దరూ ఓ బోయ్‌ప్రెండ్ కోసం ఈ విధంగా తిట్టుకోవ‌డంతో బి-టౌన్ మీడియాలో తెగ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. ఓ రకంగా చెప్పాలంటే ర‌ణ్‌భీర్‌తో విప‌రీతంగా ఎంజాయ్ చేసింది దీపికానే. యే జ‌వాని యే దివాని సక్సెస్ పార్టీలో ప‌బ్లిక్‌గానే ర‌ణ్‌భీర్‌కి ముద్దు ఇచ్చి అవాక్కుచేసింది. బాలీవుడ్‌లో దీపికా అంటే 500 కోట్ల హీరోయిన్‌. రేస్2, యే జ‌వాని యే దివాని, చెన్నైఎక్స్‌ప్రెస్ ఇలా వ‌రుస మూవీల‌తో 500 కోట్ల క్లబ్‌ను ట‌చ్ చేసింది. త‌రువాత సెకండ్ ప్లేస్‌లో 320 కోట్ల మార్క్‌ను చేరింది క‌త్రినాకైఫ్‌. ఏక్‌థాటైగ‌ర్‌, జ‌బ్‌త‌క్‌హైజాన్ మూవీల‌తో 300 వంద‌ల కోట్ల క్లబ్‌కు చేరింది. ఆ త‌రువాత థ‌ర్డ్ ప్లేస్‌లో 264 కోట్ల మార్క్‌ను చేరింది క‌రీనాక‌పూర్‌. బాడీగార్డ్‌,రావ‌న్ మూవీల‌తో 200 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయింది క‌రీనా. ఈ విధంగా చూసుకుంటే అంద‌రికంటే టాప్ పొజిష‌న్‌లో ఉంది ఇప్పుడు దీపికానే.

ఎట్ ప్రజెంట్ దీపికా చేతిలో రెండు భారీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ర‌జ‌నీకాంత్ కొచ్ఛాడియ‌న్‌, రామ్‌లీలా మూవీలు దీపికా స్టార్‌డంను మ‌రింత‌గా పెంచుతాయి. కాని క‌త్రినా చేతిలో వాల్యూ ఉన్న మూవీ ఒక్కటీ లేదు. ఇది చాలు క‌త్రినాను శాసించాడానికి దీపికాకు ఉన్న అర్హత‌. అందుకే క‌త్రినాపై గ్యాప్ దొరికితే సెటైర్లు వేసుకుంటూ వెళుతుంది దీపికాప‌దుకొనె. వీరిద్దరి మ‌ధ్య కొన‌సాగుతున్న ఈ వార్‌కి తెర‌దింపాల‌ని క‌త్రినాకైఫ్ భావిస్తుంది. త్వర‌లోనే క‌త్రినా,ర‌ణ్‌భీర్‌లు పెళ్ళిచేసుకొని దీపికాకి బుద్ది చెప్పాల‌ని క‌త్రినా ఆ దిశ‌గా ముందుకు వెళుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: