తెలుగు ఇండస్ట్రీలో పెళ్లిచూపులు చిత్రం తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో అద్భుతమైన విజయం అందుకున్నాడు విజయ్ దేవరకొండ.  పెళ్లి చూపులు చిత్రంలో అమాయకంగా కనిపించిన విజయ్ దేవరకొండ చిత్రంలో  అర్జున్ రెడ్డి లాంటి సినిమాలో బోల్డ్‌,  అగ్రెసివ్‌గా నటించాడు.  కాగా, నిన్న రిలీజ్ అయిన ‘గీతగోవిందం’చిత్రంలో తన నటనా వైవిధ్యాన్ని చూపించాడు.

సరదాగా, అమాయకంగా కనిపించే పాత్రలో నటించి అందరిని మెప్పించాడు.  వాస్తవానికి గీతా గోవిందం రిలీజ్ కి ముందు లీకేజీల తో ఇబ్బందులు పడుతూ నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ అయ్యింది.  ‘గీత గోవిందం’ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం చూసిన సెలబ్రెటీలు ఎంతో మెచ్చుకుంటున్నారు. 
Image result for geetha govindam posters
తాజాగా ఈ చిత్రం చూసిన దర్శకధీరుడు రాజమౌళి  చాలాసేపు నవ్వుకున్నానని, విజయ్ దేవరకొండ నుంచి ఇది అస్సలు ఊహించలేదని రాజమౌళి అన్నారు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత ఈ చిత్రం విజయ్ దేవరకొండ బెస్ట్ ఛాయిస్ అని, తాను ఏం చేస్తున్నాడో అతనికి స్పష్టంగా తెలుసని అన్నారు. ఈ చిత్రం సరదా సన్నివేశాలతో ఉందని, దర్శకుడు పరశురామ్ చాలా బాగా తెరకెక్కించాడని రాజమౌళి ప్రశంసించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: