బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఈ మద్య వెండితెరపై కన్నా బుల్లితెరపైనే హల్ చల్ చేస్తున్నారు. పలు యాడ్స్ లోకనిపిస్తున్న సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో వస్తున్న ‘బిగ్ బాస్’ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.  ఇప్పటికే పదకొండ సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 12 వ సీజన్ కి రెడీ అవుతుంది. ఈ ఒక్క ప్రొగ్రామ్ కాదు..‘దస్ కా దమ్’లో కూడా సల్మాన్ అలరిస్తున్నాడు. 
Image result for salman khan
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ వెండితెరపై బిజీ అయ్యాక పలువురు కథానాయికలతో ఎన్నో ప్రేమకథలను నడిపించాడు. లైఫ్ లో ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్, జరీన్ ఖాన్... ఇది సల్మాన్ మాజీ ప్రియురాళ్ల లిస్ట్ ఇది. సినిమాలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న సల్మాన్ పలువురు హీరోయిన్లతో ప్రేమలో పడ్డాడు. మనోడు ఇప్పటికీ స్టిల్ బ్యాచ్ లర్ కావడం విశేషం.
Image result for salman khan daska dam
‘దస్ కా దమ్’ పోగ్రాంలో భాగంగా సల్మాన్‌ను సరదాగా ఒక కంటెస్టెంట్ ఒక ప్రశ్న వేశాడు. ఆ క్వశ్చన్ ఏమిటంటే స్కూల్లో చదివేటపపుడు మీరు ఏ టీచర్‌కైనా సైట్ కొట్టేవారా?అంటూ కొంటే ప్రశ్న వేశాడు.  తాను స్కూల్ లో చదివే సమయంలో ఓ టీచరమ్మతో ప్రేమలో పడ్డ విషయాన్ని సల్మాన్ తాజాగా అభిమానులతో పంచుకున్నాడు.  ఎవరైనా వాళ్ల స్కూల్ డేస్‌లో టీచర్‌కు సైట్ కొట్టకుండా వుండరని చెప్పాడు. 

ఆమె పాఠం చెబుతుంటే అలాగే చూస్తుండిపోయేవాడిని. టీచర్ ను మెప్పించేందుకు సైకిల్ పై ఎక్కించుకుని ఇంటి దగ్గర దించేవాడిని. ఆమెను సైకిల్ ముందువైపు కూర్చోబెట్టుకునేందుకు వీలుగా సైకిల్ వెనుకవైపు బ్యాగ్, లంచ్ బాక్స్ ను పెట్టేసేవాడిని’ అని సల్మాన్ చెప్పగానే అక్కడున్న వారందరూ నవ్వుల్లో మునిగిపోయారు.  చాలా మంది ఈ విషయాన్ని బయటకు ఒప్పకోరు. తనకు మాత్రం ఈ విషయాన్ని చెప్పడానికి ఎలాంటి మెహమాటం లేదని చెప్పాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: