కేరళ బామతో జూనియర్ ఎన్టీఆర్ కితకితలు పెడుతూ కన్పించనున్నాడు, ఆమెతో తెగ రభస చేయనున్నాడు జూనియర్ అని టాలీవుడ్ వర్గాలు నొక్కి వక్కానిస్థున్నాయి. ఈమేరకు మాటా ముచ్చట కూడా పూర్తయి ఒప్పందం కూడా కుదిరిందట.

జూనియర్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లుంటే ఆయన పెట్టె కితకితలు ఎంత సూపరో వేరే చెప్పక్కర్లేదు మరి, అందుకే ఈ కేరళకుట్టీతో పెట్టె జూనియర్ సయ్యాటకోసం టాలీవుడ్ వేచిచూడాల్సిందే అంటున్నారు. తాజాగా తను తీస్థున్న ‘రభస’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఈ మలయాళి హీరోయిన్ నజ్రియాను ఓకే చేసారట.

సమంత ప్రధానపాత్రలో కనిపిస్థున్న ఈ సినిమా సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తోంది. దీనికి బెల్లంకొండ సురేష్ నిర్మాత. అందుకే రభస పై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: