తెలుగు చిత్ర సీమలో చిరస్థాయిగా అభిమానుల గుండెల్లో నిలిచి పోయిన మహానటులు ఎన్టీఆర్.  ఆయన జీవిత కథ ఆధారంగా చేసుకొని క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎన్టీఆర్ ఇంట్లో జరుగుతోంది.  గతంలో ఎన్టీఆర్ అబిడ్స్ ప్రాంతంలోని ఒక ఇంట్లో ఉండేవారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.
Image result for ntr biopic
ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తుండగా .. బసవతారకం పాత్రను విద్యాబాలన్ పోషిస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు పాత్ర కోసం రానా షూటింగులో జాయిన్ కాగా, హరికృష్ణ పాత్ర కోసం త్వరలో కల్యాణ్ రామ్ షూటింగులో పాల్గొననున్నాడు. శ్రీదేవి పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకోవడం అందరిలో మరింత ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఎన్టీఆర్ తో ఎక్కువ సినిమాల్లో నటించిన మరో నటి జయప్రద.  ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.

Image result for ntr biopic

 'ఎన్టీఆర్' బయోపిక్ లో జయప్రద పాత్ర కూడా కనిపిస్తుంది. ఈ పాత్ర కోసం ఈ తరం గ్లామరస్ హీరోయిన్ల పేర్లను పరిశీలించిన దర్శక నిర్మాతలు, చివరిగా రాశి ఖన్నాను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. జయప్రద పాత్రలో రాశీఖన్నా కరెక్టర్ గా సరిపోతుందని చిత్రయూనిట్ భావించినట్లు సమాచారం..అందుకే ఆ పాత్రలో రాశీఖన్నాను నటింపజేయాలని ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.  త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: