దర్శకుడు పూరి జగన్నాధ్ స్టైల్ చాలా డిఫరెంట్. తనకు నచ్చితే ఒక సినిమాను కేవలం 30 రోజులలో ఒక చుట్టూ చుట్టి పడేస్తాడు. కధల గురించి ఆలోచించాలి అనుకుంటే బ్యాంకాక్ వెళ్ళిపోతాడు. ఇంకా మనసు బాగుండక పోతే తన ఇంటిలో పెంచుకుంటున్న అనేక దేశాలకు చెందిన కుక్కపిల్లలతో ఆడుకుంటూ టైం గడిపేస్తాడు. అటువంటి పూరి, ప్రేక్షకులకు ‘హార్ట్ అటాక్’ తెప్పిస్తాను అంటూ నిన్న భాగ్యనగరంలో హీరో నితిన్ తో జత కట్టి తన కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. ‘బిజినెస్ మెన్’ సినిమా తరువాత విజయానికి దూరం అయిపోయిన పూరి పవన్, బన్నీ లతో చేసిన ప్రయోగాలు రెండూ వికటించడంతో పూరి పని అయిపొయింది అని టాక్ వస్తున్న నేపధ్యంలో తనేమిటో చూపెట్టుకోవడానికి ఈ ‘హార్ట్ అటాక్’ అంటున్నాడు.

వరస హిట్స్ తో స్పీడ్ మీద ఉన్న నితిన్ అదృష్టం తనకు కలిసి వస్తుందని ఆశించి, తానే సొంతంగా టూరింగ్ టాకీస్ అన్న పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్థాపించి ఈసారి హాంకాగ్ లు, బ్యాంకాక్ లు కాకుండా తెలుగు గడ్డ భాగ్యనగరాన్ని నమ్ముకొని నిన్నటి నుంచి షూటింగ్ ప్రారంభించాడు. ఆంధ్ర ప్రదేశ్ ఆడపడుచులకు అత్యంత ఇష్టమైన శ్రావణ శుక్రువరాన్ని తన లక్కీ డే గా మార్చుకొని నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించాడు మన పూరి.

కాని ఏ దర్శకుడు అయినా మొట్టమొదటి షాట్ ను హీరో పైనో, లేదంటే దేవుడు పటాలపైనో తీస్తాడు కాని దీనికి విరుద్ధంగా ఈ సినిమాలో వచ్చే క్లైమాక్స్ ఫైట్ ను తొలి షాట్ గా ఎంచుకొని నిన్న ‘హార్ట్ అటాక్’ చిత్రీకరణ ప్రారంభించి చూసే వారికి హార్ట్ అటాక్ వచ్చేటట్లు గానే చేశాడు. ఇంతకీ ఇంత తలక్రిందులుగా పూరి ఈ సినిమాను ఎందుకు మొదలు పెట్టాడు అంటూ రివర్స్ గేర్ అచ్చివస్తుందేమో అనుకుంటూ దర్శకుడు పూరి జగన్నాధ్ ఇలా చేసి ఉంటాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను తన పద్ధతిలో 30 రోజులాలోనే తీసేస్తాడా..? లేకుంటే క్రియేటివ్ డైరెక్టర్స్ లా అలోచించి సంవత్సరాలకు సంవత్సరాలు చేక్కుతాడా..? అనే విషయం చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: