తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య వరుసగా మల్టీస్టారర్ చిత్రాలు వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని కలిసి నటిస్తున్న చిత్రం ‘దేవదాస్’. గతంలో తెలుగు చిత్ర సీమలో చిరస్థాయిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన చిత్రం ‘దేవదాసు’.  అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిన ఈ చత్రం ఎప్పటికీ మర్చిపోలేనిది.  ఆ తర్వాత రామ్, ఇలియాన నటించిన ‘దేవదాసు’ కూడా మంచి హిట్ అయ్యింది.  ప్రస్తుతం నాగార్జున, నాని నటిస్తున్న ‘దేవదాస్’ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

దేవదాస్ అనే టైటిల్ తో చిత్ర పోస్టర్ విడుదల కాగా, ఈ పోస్టర్పై గన్, బుల్లెట్స్, చారిటబుల్ హాస్పిటల్ హోర్డింగ్స్ ని ఉంచారు. ఈ పోస్టర్ ని బట్టి చూస్తుంటే దేవ్ అనే పాత్రలో డాన్ గా నాగ్, దాస్ అనే పాత్రలో డాక్టర్ గా నాని కనిపించనున్నట్టు అభిమానులు ఓ అంచనాకి వచ్చారు.  ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ కిత కితలు పెట్టేస్తుంది.  నాగార్జున ఓ గ్లాసులో మందు పోసి సోడా కావాలా అని అడిగేలోపు నారి రా తాగేస్తున్నాడు..దాంతో షాక్ తిన్న నాగ్  ‘దాసూ.. ఏంటీ సంగతి?’ అని   ప్రశ్నించడం..సినిమా ఎంత కామెడీ ఉండబోతుందో అర్థం అవుతుంది. 

వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాని సరసన ఛలో ఫేం రష్మిక మందాన, నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. సంపూర్ణేష్ బాబు కూడా చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతుందని తెలుస్తుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.  సీనియర్ నరేష్, రావ్ రమేష్, అవసరాల శ్రీనివాస్, బాహుబలి ప్రభాకర్, వెన్నెల కిషోర్, సత్య మొదలగువారు ఈ చిత్రంలో నటిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: