ఈ సంవత్సరం నటి  సమంత అక్కినేనికి గోల్డెన్ టైమ్ నడుస్తుందనే చెప్పాలి.  రంగస్థలం, మహానటి, అభిమన్యుడు హాట్రిక్ సక్సెస్‌తో దూసుకెళ్తున్న సమంత తాజాగా యూటర్న్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే.   2016లో కన్నడలో వచ్చిన ‘యూటర్న్’కి ఇది రీమేక్. అక్కడ ఈ సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధించడంతో, తెలుగులోకి రీమేక్ చేశారు. ముఖ్యమైన పాత్రలో ఆది పినిశెట్టి .. రాహుల్ రవీంద్రన్ .. భూమిక నటించారు.


సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను, ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు.  ఆల్బమ్ తరహాలో ఈ ప్రమోషనల్ సాంగ్ ను అనిరుధ్ ఆలపిస్తుండగా .. సమంత డాన్స్ చూపించారు. అలాగే సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాల బిట్స్ ను కూడా ఈ సాంగ్ కి జోడించారు. "దిశల్ని మార్చుకున్నా .. ఎలాంటి దారుల్లో పోతున్నా .. మనస్సు మారుతున్నా .. గతాల జ్ఞాపకం ఏదైనా" అంటూ ఈ సాంగ్ కొనసాగుతోంది. 


ఈ నగరానికి ఏమైంది ఫేం, సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మిరెడ్డి యూటర్న్ ప్రమోషనల్ వీడియోను చిత్రీకరించారు. కృష్ణ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ పాటనకు యశ్వంత్ కోరియోగ్రఫిని అందించారు. ఈ వీడియో సాంగ్‌లో సమంత స్టైలిష్ సెప్టులతో అదరగొట్టింది. రోడ్డు ప్రమాదం కథా నేపథ్యంగా సాగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం సెప్టెంబర్ 13న రిలీజ్ కానున్నది. 

మరింత సమాచారం తెలుసుకోండి: