భారత దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో తన సంగీతంతో మంత్ర ముగ్ధులను చేసిన సంగీత దర్శకుడు ఏఆర్.రహమాన్.  చిన్న వయసులోనే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన  ‘రోజా’ సినిమాతో తన సత్తా చాటిన ఏఆర్ రెహమాన్..ఎన్నో అద్భుతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించారు.  రీసెంట్ గా  కేరళా వరదలు అపార నష్టాన్ని కలిగించిన విషయం తెలిసిందే. ప్రకృతి ప్రకోపాలని కేరళ తల్లడిల్లింది. భారీ వదలు కేరళను ముంచెత్తాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుని పోయాయి.

కొన్ని ఇళ్లు కళ్ల ముందే పేకమేడల్లా కూలిపోయాయి..ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోగా వందల మంది గాయపడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వృద్దులు చిన్నపిల్లల పరిస్థితి దారుణంగా తయారైంది. అనారోగ్యంతో బాధపడుతున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం సహాయక బృందాలకు తలకు మించిన  భారం అయినా..ఎంతో కష్టపడ్డారు.  ఇక కేరళా బాధితులను ఆదుకునేందుకు..దేశ వ్యాప్తంగా అన్ని రంగాల వారు ముందుకు వచ్చారు.
Image result for కేరళా వరదలు
సినీ రంగానికి చెందిన వారు తమ వంతు సహాయాన్ని ప్రకటించారు.  తాజాగా ఇండియన్ మ్యూజిక్ సంచలనం, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కేరళ వరద బాధితుల కోసం రూ. 1 కోటి విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశారు. యూఎస్ఏలోని వివిధ ప్రాంతాలు పర్యటిస్తూ రెహమాన్ అండ్ టీమ్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. వాషింగ్టన్‌లో తన ప్రదర్శన సందర్భంగా రెహమాన్ ఈ విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా కేరళ ప్రజలను ఉద్దేశించి... 'కేరళ, కేరళ, డోన్ట్‌ వర్రీ కేరళ' అంటూ పాట పాడారు.సెప్టెంబర్ 5న రెహమాన్ తన పర్యటన ముగించుకుని ఇండియా తిరిగి వస్తారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: