ప్రభాస్ కు స్పీడ్ గా సినిమాలు చేసే అలవాటు లేదు. అలేగే ఇండస్ట్రీ వర్గాల టాప్ పొజిషన్ లెక్కలపై పెద్దగా ఆశక్తి కూడ కనపరచడు. ప్రతి శుక్రవారం మారిపోయే ఇండస్ట్రీ వర్గాల ర్యాంకింగ్స్ పై తనకు నమ్మకంలేదు అంటూ ప్రభాస్ ఓపెన్ గానే  ఒక మీడియా సంస్థకు ఆమధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. 
बाहुबली प्रभास ने शुरू की “साहो” की शूटिंग
ఇలాంటి పరిస్థుతులలో ‘సాహో’ ఎప్పుడు విడుదల అవుతుందో ప్రభాస్ కు కూడ క్లారిటీ లేని నేపధ్యంలో ప్రభాస్ ఇంత హడావిడి గా రేపు ‘జిల్’ రాధకృష్ణతో ఒక మూవీ ప్రారంభించడం వెనుక ఒక కారణం ఉంది అన్న ప్రచారం  జరుగుతోంది. త్వరలో శూన్యమాసం వస్తున్న నేపధ్యంలో మంచిరోజులు దొరకవు అన్న కారణాలు బయటకు చెపుతున్నా అసలు విషయం వేరు అన్న వార్తల హడావిడి జరుగుతోంది.
radha krishna and prabhas movie goes on floors
తెలుస్తున్న సమాచారం మేరకు ‘సాహో’ సినిమా కోసం త్వరలో యూకె వెళ్లే ఆలోచనలో ఆసినిమా  యూనిట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రేపు ప్రారంభం కాబోతున్న ప్రభాస్  రాధాకృష్ణ సినిమాకు సంబంధించి కొన్ని  సన్నివేశాలు యూకెలో చిత్రీకరించవలసిన అవసరం ఉన్న రీత్యా ఒకే స్పాట్ లో రెండు మూవీల షూటింగ్ సమాంతరంగా నిర్వహిస్తే ఖర్చులతో పాటు పర్మిషన్లు ఇతరత్రా వ్యవహారాలు కలిసిరావడంతో ఒకేసారి ఈరెండు మూవీల షూటింగ్ సమాంతరంగా నడిపించే మాష్టర్ స్కెచ్ ప్రభాస్ వేసినట్లు సమాచారం. 

ఇలా ఈరెండు సినిమాలకు సంబంధించి షూటింగ్ ఒకేసారి నిర్వహించాలి అంటే అసలు మంచిరోజునాడు ప్రారంభం కావాలి కాబట్టి రేపు ప్రభాస్ రాథా కృష్ణల మూవీ పట్టాలు ఎక్కే కార్యక్రమం ప్రారంభం అవుతోంది అని అంటున్నారు. అంతేకాదు ఈమూవీ ఓపెనింగ్ ను రేపు ప్రభాస్ అతి నిరాడంబరంగా చేస్తున్నట్లు టాక్. దీనితో మారుతున్న పరిస్తుతులను బట్టి ప్రభాస్ కూడ మారిపోయాడు అంటూ జోక్స్ పడుతున్నాయి..  
 


మరింత సమాచారం తెలుసుకోండి: