విజయ దేవరకొండ ఇప్పుడు ఒక సెన్సేషన్ హీరో అని చెప్పవచ్చు. రీసెంట్ గా వచ్చిన సినిమా గీత గోవిందం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సినిమా విడుదల మూడువారాల తరువాత నిన్నటి శుక్రవారం కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దగ్గర దగ్గర 30 లక్షల షేర్ వసూలు చేసింది. రెండు రాష్ట్రాలకు కలిపి 29.76 లక్షల షేర్ వచ్చింది. శుక్రవారం ఏకంగా కాస్త టాక్ వున్న సినిమాలు మూడు, మరో అరడజను చిన్న సినిమాలు విడుదలయ్యాయి. నన్ అనే హాలీవుడ్ డబ్బింగ్ కూడా వచ్చింది.

Image result for geetha govindam

అయినా వీటన్నింటిని తట్టుకుని 30 లక్షల షేర్ రాబట్టడం అంటే చిన్న విషయం కాదు. పైగా కొన్ని సెంటర్లలో ఈవారం విడుదల అయిన వాటికన్నా, గీత గోవిందం షేర్ ఎక్కువ వుంది. ఈ లెక్కన ఈ వీకెండ్ లో ఒక కోటి రూపాయలు షేర్ లాగేలా వుంది. ఇప్పటికే 60కోట్లను దాటేసింది గీత గోవిందం షేర్.

Image result for geetha govindam

ఈ సినిమా పుణ్యామాని, విజయ్ దేవరకొండ తరువాత సినిమా నోటా ఆంధ్ర ఏరియా హక్కులే 30 కోట్లకు పైగా చెబుతున్నారట. ముఫై కోట్లకు పైగా అంటే టాప్ హీరోల సినిమాల కింద లెక్క. రంగస్థలం ముఫై మూడుకోట్లు, భరత్ అనే నేను నలభై కోట్ల రేషియోలో అమ్మారు. ఇప్పుడు విజయ్ సినిమా కూడా ఆ రేంజ్ లో చెప్పడం అంటే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో విజయ్ టాప్ ఫైవ్ హీరోల సరసన చేరిపోయినట్లే. ప్రస్తుతం ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ వున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: