టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా.. దర్శకుడిగా రవిబాబు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు. వైవిధ్య భరిత చిత్రాల డైరెక్టర్ రవిబాబు దర్శకత్వంలో పందిపిల్ల ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా అదుగో. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌తో కలిసి రవిబాబు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవిబాబుతో పాటు అభిషేక్ వర్మ, నభా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
రీసెంట్ గా ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో కొంత సేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ‘హార్ట్ టచింగ్ లవ్ .. థ్రిల్లింగ్ సస్పెన్స్ .. పవర్ ప్యాక్డ్ డైలాగ్స్ .. ఎమోషన్ .. ధమాకా డాన్స్ఈ’ అంటూ అందుకు సంబంధించిన దృశ్యాలను చూపించారు. రౌడీల బారి నుంచి తప్పించుకుంటూ .. వాళ్లపై ఎదురుదాడి చేసే తమాషా సీన్స్ కూడా ఇందులో వున్నాయి. ఇక ట్రైలర్ లో బంటి చేస్తున్న డ్యాన్స్ చూస్తుంటే నవ్వు ఆగడం లేదు. మొత్తానికి రవిబాబు బంటి (పందిపిల్ల)తో చేయించిన అల్లరి అంతా ఇంతా కాదు. ఈ ట్రైలర్లో సినిమాలో మిగతా ప్రధాన పాత్రలను పరిచయం చేశారు.
తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్‌తో రూపొందుతున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. తెలుగులో అదుగో పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో ఇతర భారతీయ భాషలన్నింటిలో బంటీ పేరుతో రిలీజ్ చేస్తున్నారు.