భారతీయ చలన చిత్ర రంగంలో డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన రోబో సెన్సేషనల్ హిట్ కావడమే కాదు..ఇండియన్ మూవీస్ లో కూడా టెక్నాలజీని ఇంత అద్భుతంగా వాడుతారా అని ప్రపంచ దేశాలు అశ్చర్యపోయాయి. ఇదే కాంబినేషన్ లో రోబో సీక్వెల్ వస్తుంది. సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ వినాయక చవితి కానుకగా గురువారం టీజర్ లాంచ్ చేయబోతున్నట్లు కొన్ని రోజుల కిందటే ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఆల్రెడీ షూటింగ్ పార్ట్ కంప్లీటైన ఈ మూవీ పోయిన దీపావళికే విడుదల కావాల్సింది. కానీ గ్రాఫిక్స్ వర్క్  కారణంగా రిలీజ్ డేట్ ఆలస్యం అవుతూ వస్తోంది.


ఈ సినిమా రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ ఏకకాలంలో తమిళం, తెలుగు, హిందీలో నిర్మిస్తోంది. అంతేకాదు ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా పదహారు భాషల్లో ఏకకాలంలో డబ్ చేసి రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నారు.  ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న భారీ విజువల్‌ వండర్‌ చిత్రం 2.ఓ. రజనీకి అమీజాక్సన్‌ జతకట్టగా.. అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.


లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేశారు. ఇక టీజర్ విషయానికి వస్తే.. సగటు ప్రేక్షకుడు ముక్కున వేలేసుకోక తప్పదు. అబ్బురపరిచే గ్రాఫిక్స్‌, భారీ ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ ఈ టీజర్‌లో కనిపిస్తున్నాయి. రజనీ మరోసారి సైంటిస్ట్‌ అవతారం ఎత్తి చిట్టి (రోబో) రూపంలో అన్ని సమస్యలు తీర్చనున్నాడు.


సెల్ ఫోన్లు అన్ని మాయం కావడం..ఒకే దగ్గరకు వచ్చి ఓ పెద్ద పక్షిగా మారడం..నిజంగా అద్భుతం అనిపిస్తుంది.  అక్షయ్‌కుమార్‌ బయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సంగీత దర్శకుడు ఏఆర్‌ రహామన్‌ టీజర్‌లోనే బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ అదరగొట్టేశాడు. మొత్తానికి ఈ టీజర్‌లో శంకర్‌ తన మార్క్‌ చూపించాడు. నవంబర్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు మూవీ యూనిట్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: