ప్రముఖ నిర్మాత దిల్‌ రాజ్ ఒక సినిమా విజయాన్ని అంచనా వేయడంతో చాల అనుభవజ్ఞుడు అని ఇప్పటి వరకు చాలమంది భావిస్తూ వచ్చారు. అయితే అటువంటి ప్రముఖ నిర్మాత తీసిన ‘లవర్’ 'శ్రీనివాస కళ్యాణం' మూవీలు వరస పరాజయాలుగా మారడంతో దిల్ రాజ్ సక్సస్ మంత్ర గాడి తప్పిందా అన్న కామెంట్స్ ప్రస్తుతం వినిపిస్తున్నాయి. 
Dil Raju producing Teri's Telugu remake, Is it a hasty decision?
ఇప్పటి వరకు దిల్ రాజ్ ను ఒక హిట్ మిషన్ అంటూ పొగిడిన ఇండస్ట్రీ వర్గాలు ఇతడి అంచనాలు కూడ తప్పుతాయి అన్న భావనలోకి వచ్చేశారు. ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం దిల్ రాజ్ నిర్మిస్తున్న ‘హలో గురూ ప్రేమ కోసమే' చిత్రాన్ని విడుదల చేయడానికే భయపడిపోతున్నట్లు వార్తలు హడావిడి చేస్తున్నాయి. దీనికి కారణం ఈమూవీకి సంబంధించి రీషూట్లు జరుగుతున్నాయనే ప్రచారం అని అంటున్నారు. 
Dil Raju. YouTube
వాస్తవానికి దిల్ రాజ్ తన అనుకూల మీడియా వర్గాల ద్వారా ఈమూవీకి సంబంధించి వస్తున్న రీ షూట్ వార్తలను ఇప్పటికే ఖండించాడు. దీనితో రీషూట్ అంటే దిల్ రాజ్ ఎందుకు అలా భయపడిపోతున్నాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి. రీషూట్‌ అనేదానిని ఒక సినిమా షూటింగ్‌లో ప్రాసెస్‌గా మాత్రమే అంటూ ఇప్పటి వరకు కామెంట్ చేసిన దిల్ రాజ్ తన సినిమాలకి రీషూట్స్‌ చేశామని చాల గర్వంగా గతంలో చెప్పుకునే వాడు. 
dil raju
కానీ ఇప్పుడు ఒక సినిమా రీ షూట్ ను వీక్‌నెస్‌గా పరిగణిస్తూ దిల్ రాజ్ ఖంగారు పడడటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. అసలే డౌన్‌ లో ఉన్నపుడు రీషూట్లు అని ప్రచారం జరిగితే అది మరింత డ్యామేజ్‌ అవుతుందని దిల్‌ రాజ్ ఖంగారు పడుతున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేవలం రెండు పరాజయాలు ఎంతటి గొప్ప వ్యక్తికైనా ఎలాంటి టెన్షన్ ను క్రియేట్ చేస్తాయో ఈ సంఘటన ఒక ఉదాహరణ అని అంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: