గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  గత నెల ప్రముఖ నటులు, రాజకీయ నాయుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.  ఇక తమిళ ఇండస్ట్రీలో కూడా వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  తాజాగా తెలుగు  సినీ విమర్శకుడు , దర్శకుడు కే ఎన్ టి శాస్త్రి కన్నుమూశారు. గత ఏడు నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగుసినీ పరిశ్రమలో తనదైన ముద్రవేసిన శాస్త్రి.. కొన్ని కన్నడ చిత్రాలకు కూడా దర్శకుడిగా వ్యవహరించారు.  అంతర్జాతీయ చలన చిత్ర వారోత్సవాలలో జ్యూరీగా కూడా పనిచేశారు.  

Telugu film maker and critic KNT Sastry passes away in Hyderabad

ఇటీవల షాను దర్శకత్వంలో సీఎఫ్ఎస్ఐ నిర్మాతగా వచ్చిన బాలల చిత్రాన్ని శాస్త్త్రి పూర్తి చేశారు. ఈ చిత్రానికి సంగీతాన్ని ఇసాక్ థామస్ కొట్కుపల్లి అందించారు. ‘సురభి, థిల్లాడనమ్, కమ్లి, స్నేహన్వేషణ వంటి పలు చిత్రాలకు శాస్త్రి దర్శకత్వం వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున రెండు నందులను సురభి, తిలదానం చిత్రాలకు  అందుకున్నారు. 


సినీ విమర్శకుడిగా పేరొందిన శాస్త్రి.. 30ఏళ్లకు పైగా అనుభవంలో సినిమాలకే తన జీవితాన్ని అంకింతం చేశారు. ఎన్నో అంతర్జాతీయ ఫిల్మి ఫెస్టివల్స్‌కు కూడా జ్యూరీగా వ్యవహరించారు. 12 అంతర్జాతీయ అవార్డులతో పాటు ఆయన దర్శకత్వం వహించిన థిల్లాడనమ్ చిత్రానికి 7 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. నేషనల్ ఫిల్మి అవార్డుల ఉత్సవానికి క్రిటిక్స్ జ్యూరీ చైర్మన్‌గా వ్యహరించారు.  జన్మించింది కర్ణాటకలో అయినా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారు. సెప్టెంబర్ 5, 1945న కర్ణాటకలో జన్మించారు.  


నందితాదాస్ ప్రధానపాత్రలో నటించిన కమిలి చిత్రాన్ని రూపొందించాడు కే ఎన్ టి శాస్త్రి , ఆ సినిమా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు . కమిలి చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభించాయి . కే ఎన్ టి శాస్త్రి మరణంతో తీవ్ర విషాదం నెలకొంది ఆ కుటుంబంలో . పలువురు సినీ ప్రముఖులు కే ఎన్ టి శాస్త్రి మృతి పట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు .

మరింత సమాచారం తెలుసుకోండి: