తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ కమెడియన్ వడివేలు అంటే తెలియని వారు ఉండరు.  తెలుగులో బ్రహ్మానందం ఎలాగో తమిళ ఇండస్ట్రీలో వడివేలు అలాంటి కమెడియన్.  వీరిద్దరిని తెరపై చూస్తే చాలు..కేవలం హావభావాలతో నటించి కడుపుబ్బా నవ్విస్తారు. తాజాగా తమిళనాట వడివేలు ని బ్యాన్ చేసినట్లు రూమర్లు వినిపిస్తున్నాయి.  తన హాస్య చతురతతో స్టార్ హీరోల స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు వడివేలు.  కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఈ మధ్యే రీ ఎంట్రీ ఇచ్చారు.

ఒకదశలో చెప్పాలంటే..స్టార్ హీరో రేంజ్ లో రెమ్యూనరేషన్ కూడా వడివేలు తీసుకున్నట్లు సమాచారం.  అప్పట్లో ప్రతి చిత్రంలోనూ వడివేలు ఖచ్చితంగా ఉండాలని హీరోలు కోరుకునే స్థాయిలో మనోడి పాపులారిటీ ఉండేది.  కానీ గత కొంత కాలంగా వడివేలు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే.  ఆ మద్య లారెన్స్ నటించిన ‘శివలింగ’చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు.  గతంలో వడివేలు  దర్శకుడు శింబు దేవన్ దర్శకత్వంలో 2006లో వడివేలు నటించిన 'హింసించే రాజు 23వ పులికేసి' సూపర్ హిట్ అయ్యింది. 
Image result for Himsinche 23va Raju Pulikesi
ఈ చిత్రంలో వడివేలుకి ఎంతో క్రేజ్ వచ్చింది.   ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా కూడా నటించారు.  ఇక  'హింసించే రాజు 23వ పులికేసి' సీక్వెల్ కోసం ప్లాన్ చేశారు శింబు దేవన్.   అందుకోసం వడివేలుకు భారీ రెమ్యునరేషన్ చెల్లించి, సెట్స్ కూడా వేశారు.  అయితే కొన్ని వివాదాల వల్ల వడివేలు ఆ షూటింగ్ వెళ్లకుండా నో చెప్పారట. దాంతో చిత్ర నిర్మాతకు ఎంతో నష్టం వాటిల్లిందట.

దాంతో  చిత్ర నిర్మాత శంకర్  మండలిలో పిర్యాదు చేశారు.  ఫిర్యాదును స్వీకరించిన కౌన్సిల్ సినిమాలో నటించడం లేదా నష్టపరిహారం కింద 9 కోట్లు చెల్లించమని వడివేలుకు సూచించారట.  అయితే వడివేలు కౌన్సిల్ మాటల్ని లెక్కచేయకపోవడంతో ఇకపై ఆయనతో ఎవరూ పనిచేయవద్దని, ఆయన్ను బ్యాన్ చేశామని మండలి సభ్యులు నిర్మాతలు, దర్శకులకు నోటీసులు పంపారట.  మరి ఈ విషయంపై వడిడేలు ఎలా స్పందిస్తారో..తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: