లీడ్ కాస్టింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్లీడ్ కాస్టింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్స్లో నరేషన్, సెకండ్ హాఫ్
నేర చరిత్ర కలిగిన భూపతి (ప్రకాశ్ రాజ్) మాఫియా లీడర్ గా పవర్ ఫుల్ మ్యాన్ గా సిటీలో నివసిస్తుంటాడు. అతనికి ముగ్గురు కొడుకులు. పెద్దవాడు వరద (అరవింద స్వామి).. రెండో వాడు త్యాగు (అరున్ విజయ్), మూడవ వాడు రుద్ర (శింభు). వరద తండ్రి వారసత్వంగా గ్యాంగ్ స్టర్ గా ఎదుగుతాడు. భూపతి తర్వాత తానే డాన్ అవ్వాలని ఆకాంక్షిస్తాడు. అయితే దానికి తన తమ్ముళ్లే అడ్డుపడతారు. భూపతి రెడ్డి మరణం తర్వాత వీరి మధ్య గొడవలు మరింత పెద్దదవుతాయి. అన్నదమ్ముల మధ్య జరిగే గొడవలో రసూల్ (విజయ్ సేతుపతి) కారణమవుతాడు. ఇంతకీ రసూల్ ఎవరు..? అనదమ్ముల్లో ఎవరు గెలిచారు..? 

శింభు, విజయ్ సేతుపతి, అరవింద స్వామి తమ పాత్రలతో అలరించారు. శింభు చాలా రోజుల తర్వాత తన నటనతో మెప్పించాడని చెప్పొచ్చు. అరవింద స్వామి కూడా కొత్తగా కనిపించాడు. ఇక విజయ్ సేతుపతి ఎప్పటిలానే అదరగొట్టాడు. ఇక ప్రకాశ్ రాజ్, అరుణ్ విజయ్, జయసుధ తమ పాత్రలతో మెప్పించారు. రసూల్ పాత్రలో విజయ్ సేతుపతి బాగా చేశాడు.

రెహమాన్ మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్తుంది. మణిరత్నం రాసుకున్న కథ బాగున్నా కథనం ఏమంత కిక్ ఎక్కించలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ సెకండ్ హాఫ్ కాస్త ట్రిం చేస్తే బాగుండేది.

అన్నదమ్ముల మధ్య జరిగే కథతో మణిరత్నం ఈ నవాబ్ సినిమా రాసుకున్నాడు. ఈ సినిమాలో క్యారక్టర్స్ బాగా రాసుకున్నా కొన్ని కాన్ ఫ్లిక్ట్స్ కనిపిస్తాయి. ఇక మొదటి భాగం మొత్తం చాలా సరదాగా అనిపించినా సెకండ్ హాఫ్ సాగదీతగా అనిపిస్తుంది. కథ బాగా రాసుకున్నప్పటికి కథనం చాలా స్లోగా సాగుతుంది.

రేసీ స్క్రీన్ ప్లేకి అవకాశం ఉన్నా మణిరత్నం తన మార్క్ గా సినిమా నెమ్మదిగా తీసుకెళ్లారు. అయితే మణిరత్నం సినిమాలు నచ్చే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. అరవింద స్వామి పాత్ర క్యారక్టరైజేషన్ అలా ఉండటానికి చెప్పిన కారణాలు అంత సూట్ అవ్వలేదు. ఫైనల్ గా యూత్ ఆడియెన్స్ తో పాటుగా సిని ప్రేమికులకు మణిరత్నం మేజిక్ గా వచ్చిన నవాబ్ నచ్చేస్తుంది.   
Arvind Swami,STR,Arun Vijay,Vijay Sethupathi,Jayasudha,Jyotika,Aishwarya Rajesh,Aditi Rao Hydari,Mani Ratnam,Subaskaran,A.R Rahmanనవాబ్.. మణిరత్నం మ్యాజిక్ వర్క్ అవుట్ అయినట్టే.. కాని..!

మరింత సమాచారం తెలుసుకోండి: