‘దేవదాస్’ రిజల్ట్ తెలిసిపోవడంతో ఇక వచ్చే వారం విడుదల కాబోతున్న విజయ్ దేవరకొండ ‘నోటా’ పై అంచనాలు ప్రారంభం అయ్యాయి. ఈమూవీ రాజకీయ నేపధ్యంతో ఉండే సినిమా అని తెలిసినప్పటికీ ఈమూవీలో ముగ్గురు ముఖ్యమంత్రుల జాతకాలను విజయ్ దేవరకొండ టచ్  చేయబోతున్నాడు అని వస్తున్న వార్తలు రాజకీయ వర్గాలలో కలవర పాటును కలగచేస్తున్నట్లు తెలుస్తోంది. 
Vijay Devarakonda New Film Nota Trailer - Sakshi
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను మార్పులు తీసుకువచ్చిన నందమూరి తారక రామారావు అదేవిధంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పైనా `నోటా`లో కీలక సన్నివేశాల్ని తెలుగు తమిళ ప్రేక్షకులు చూడబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఐదు సార్లు తమిళనాడును పరిపాలించిన జయలలిత పైన కూడ ‘నోటా’ లో ప్రస్తావన ఉందట. 

ఆ ముగ్గురు ముఖ్యమంత్రుల పైనా చెప్పుకోతగ్గ కొన్ని సీన్స్ ఈమూవీలో ఉంటాయని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో వీటిలో వివాదాలు తొంగి చూసే చాన్సుందనే ప్రచారం సాగుతోంది. ఈవిషయాలను ‘నోటా’ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈముగ్గురి ముఖ్యమంత్రుల పైనా కొన్ని ఆసక్తికర సీన్స్ ‘నోటా’ లో ఉన్నమాట వాస్తవమే అంటూ వివాదాలను మాత్రం దగ్గరకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాము అని అంటున్నాడు ‘నోటా’ నిర్మాత.
NOTA teaser,Vijay Deverakonda,Vijay Deverakonda Movie
కోలీవుడ్ మీడియాలో విజయ్ దేవరకొండకు మంచి ప్రాధాన్యత లభిస్తోంది. అనేక ప్రముఖ కోలీవుడ్ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్న విజయ్ దేవరకొండ తమిళంలో మాట్లాడుతూ అక్కడ మీడియా వర్గాలను తన బుట్టలో వేసుకుంటున్నట్లు టాక్. సూర్య లాంటి టాప్ హీరోతో విజయ్ దేవరకొండ ఒక సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఇది చాలదు అన్నట్లుగా విజయ్ విజయవాడలో ఒక భారీ గ్రౌండ్ లో ‘నోటా’ కు సంబంధించి ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి తాను కేవలం తెలంగాణకు సంబంధించిన హీరోను మాత్రమే కాకుండా కోస్తా జిల్లాల వ్యక్తిని అని వ్యూహాత్మక సంకేతాలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: