‘నోటా’ని పాలిటిక్స్ చేయొద్దు : విజయ్ దేవరకొండ
మరిన్ని

‘నోటా’ని పాలిటిక్స్ చేయొద్దు : విజయ్ దేవరకొండ

తెలుగు ఇండస్ట్రీలో కేవలం మూడు చిత్రాలతోనే ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశాడు విజయ్ దేవరకొండ.  పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం.  ఈ మూడు చిత్రాలు కూడా డిఫరెంట్ లుక్స్ తో కనిపించిన విజయ్ దేవరకొండ తాజాగా ‘నోటా’చిత్రంతో ప్రేక్షకుల ముదుకు రాబోతున్నాడు.  విజయ్ దేవరకొండ, మెహ్రిన్ కౌర్ జంటగా నటించిన చిత్రం 'నోటా'.  ఇప్పటికే ఈ చిత్రంపై రక రకాల వివాదాలు మొదలయ్యాయి.  గతంలో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రంపై కూడా ఎన్నో విమర్శలు, వివాదాలు చుట్టుముట్టాయి.

కానీ థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత అందరి అభిప్రాయం మార్చుకున్నారు.   ఇప్పుడు  ‘నోటా’చిత్రంపై కూడా రక రకాల విమర్శలు, వివాదాలు వస్తున్నాయి.  కానీ, అందరూ అనుకున్నట్లు ఈ చిత్రంలో ఎలాంటి వివాదం ఉండబోదని చిత్ర యూనిట్ అంటున్నారు.  ఈ చిత్రం అక్టోబర్ 5వ తేదీన విడుదల కానుంది. దీంతో సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఆదివారం విజయవాడలో పబ్లిక్ పబ్లిక్ నిర్వహించారు.