ఈ మద్య జగిత్యాలతో జరిగిన జంట ఆత్మహత్య కేసు గురించి అందరికీ తెలిసిందే.  తెలిసీ తెలియని వయసులో పదవతరగతిలో ఇద్దరు విద్యార్థులు తమ తోటి విద్యార్థినులను ప్రేమించి తమ ప్రేమ విఫలం అవుతుందని భావించి జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన కూసరి మహేందర్, బంటు రవితేజ అనే పదో తరగతి విద్యార్థులు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఆర్‌ఎక్స్ 100’సినిమా ప్రేరణతోనే వీరిద్దరూ చనిపోయినట్లు వార్తలు వచ్చాయి.   ఈ విషయం కాస్త వైరల్ అవడంతో చిత్ర యూనిట్ స్పందిస్తుంది.

తాజాగా ఈ ఆత్మహత్యలపై ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ స్పందించాడు.  ఇప్పటి వరకు ఈ విషయంపై వస్తున్న రక రకాల వార్తల గురించి విన్నానని..జగిత్యాల జిల్లాలో ఇద్దరు పిల్లలు చనిపోయిన ఘటనలో మీడియా ‘ఆర్ఎక్స్ 100’ సినిమాను విలన్ గా చూపిస్తోందని కార్తికేయ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ సినిమాలో హీరో ఎక్కడా చనిపోలేదని..కాకపోతే హీరోయిన్ ప్లాన్ చేసి చంపిస్తుందని..అంత మాత్రాని ప్రేమ విఫలం కాదని..తన ప్రేమలో త్యాగం ఉంటుందని అన్నాడు కార్తికేయ.   

తెలుగు రాష్ట్రాలు ఆర్ఎక్స్ 100 సినిమాను అద్భుతంగా ఆదరించాయనీ, పిల్లా రా పాటను విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నాయని కార్తికేయ అన్నాడు.   అయితే సినిమాలో తప్పని సరి పరిస్థితిలోనే హీరో చనిపోయే ముగింపు ఉంటుందని..దాన్ని వేరుగా అర్థం చేసుకోవడం మన మనసులను బట్టి ఉంటుందని కార్తికేయ అన్నారు. సినిమాలో రకరకాల కేరెక్టర్లు ఉంటాయనీ, ప్రజలు చనిపోవాలని ఏ ఆర్టిస్టూ కోరుకోడని వ్యాఖ్యానించాడు. 

తమ పిల్లలను ఎంత ప్రేమగా చూసుకుంటారో..అదే రీతిలో వారి వ్యవహారాలు కూడా జాగ్రత్తగా పరిశీలించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు, సమాజానికి కూడా ఉంటుందని అన్నాడు. కళాకారులు, డైరెక్టర్లను ఉగ్రవాదులుగా చూడటం సరికాదన్నాడు. ఇలాంటి బాధాక‌రమైన సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు త‌మ‌ను నెగెటివ్‌గా చూడ‌డం మానేసి, పిల్ల‌ల‌ను స‌న్మార్గంలో న‌డిపించేలా ప్ర‌య‌త్నించాల‌ని సూచించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: